క్షయ వ్యాధిని నేనెలా నిరోధించగలను
From Audiopedia - Accessible Learning for All
గుర్తుంచుకోండి: క్షయ వ్యాధి ఉన్న వారికి నయం అయ్యే వరకు చికిత్స అందించడం మాత్రమే క్షయ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ఉత్తమ మార్గం కాగలదు. ఈ విషయాలు కూడా సహాయపడగలవు:
క్షయ వ్యాధి ఉన్న వ్యక్తితో కలిసి నివసిస్తున్నవారు లేదా 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా దగ్గు తగ్గని వారు క్షయ పరీక్ష చేయించుకునేలా ప్రోత్సహించండి.
అత్యంత ప్రాణాంతకమైన క్షయ వ్యాధిని నిరోధించడానికి ఆరోగ్యవంతులైన శిశువులు మరియు పిల్లలకు బిసిజి టీకాతో రోగనిరోధక శక్తి అందించండి. హెచ్ఐవి/ఎయిడ్స్‌తో బాధపడుతున్న పిల్లలకు బిసిజి టీకా ఇవ్వకూడదు.
క్షయ వ్యాధి ఉన్న వారికి లేదా దగ్గినప్పుడు కఫంలో రక్తం పడేవారికి దూరంగా ఉండండి.