క్షయ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది
క్షయతో బాధపడే ఎవరైనా దగ్గినప్పుడు, వారి నుండి వెలువడిన సూక్ష్మక్రిములు గాలిలోకి వ్యాపించడం వల్ల ఒక వ్యక్తి నుండి మరొకరికి క్షయ వ్యాపిస్తుంది. క్షయ సూక్ష్మక్రిములు గాలిలో గంటల తరబడి జీవించగలవు.
ఊపిరితిత్తుల్లో క్షయ సూక్ష్మక్రిములతో బాధపడుతున్న వ్యక్తులు ఇతరులకు క్షయ వ్యాధిని వ్యాప్తి చేయగలరు. మహిళలు క్షయతో బాధపడుతున్నప్పుడు, అది వారి పిల్లలకు మరియు వారికి ప్రతిరోజూ సపర్యలు చేసే ఇతరులకు వ్యాపించవచ్చు. క్షయ ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ, క్షయ వ్యాధి లక్షణాలు లేని వ్యక్తుల నుండి మరియు శరీరంలోని ఇతర భాగాలకు క్షయ సోకిన కారణంగా బాధపడే వ్యక్తుల నుండి క్షయ ఇతరులకు సోకదు.
సరైన చికిత్స అందించని పక్షంలో, క్షయ వ్యాధి బారిన పడిన వ్యక్తి నుండి ప్రతి సంవత్సరం మరో 10 మందికి క్షయ సోకుతుంది. అయితే, క్షయ వ్యాధి వ్యక్తి సుమారుగా ఒక నెల రోజులు మందులు తీసుకున్న నాటి నుండే అతని వల్ల క్షయ సోకే ప్రమాదం దాదాపుగా ఉండదు.