గర్భం రావాలని నేను కోరుకోనప్పటికీ నాకు గర్భం వస్తే నేనేం చేయాలి
మీరు సెక్స్‌లో పాల్గొన్న తర్వాత, మీ నెలసరి రక్తస్రావం ఆలస్యం కావడం, మీ రొమ్ములు నొప్పి పెట్టడం, మీరు తరచుగా మూత్ర విస్తర్జనకు వెళ్తుంటే లేదా మీకు వాంతులు వస్తున్నట్టుగా ఉంటే మీరు గర్భవతి అయ్యుండవచ్చు. మీరు నిజంగానే గర్భవతిగా ఉన్నారా అని ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం వీలైనంత త్వరగా ఆరోగ్య కార్యకర్తను లేదా మంత్రసానిని సంప్రదించండి.
చాలామంది యువతులు వారు కోరుకోని సమయంలో గర్భవతులవుతుంటారు. వారిలో కొందరికి కుటుంబం మరియు స్నేహితుల నుండి అవసరమైన మద్దతు లభిస్తుంటుంది. కానీ, ఇతరులకు అదంత సులభం కాదు.
సంసిద్ధంగా లేని సమయంలో గర్భం దాల్చిన కారణంగా, సమస్యలో చిక్కుకున్నట్టుగా భావించి, ఆ గర్భాన్ని మీరు విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు దయచేసి మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు విశ్వసించే పెద్దవారితో మాట్లాడండి. మీ జీవితం చాలా విలువైనది. దానిని సులభంగా కోల్పోకండి. ప్రపంచవ్యాప్తంగా, ప్రమాదకర మార్గాల్లో గర్భస్రావం చేసుకునే ప్రయత్నంలో బాలికలు మరియు మహిళలు మరణిస్తున్నారు. గర్భస్రావం కోసం అనేక సురక్షిత మార్గాలున్నాయి.