గర్భధారణ మరియు శిశు జననం గురించి నేను ఏం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ప్రతి గర్భిణీ స్త్రీకి మంచి ఆరోగ్యం, మంచి ఆహారం మరియు ఆమె కుటుంబం మరియు సమాజం నుండి ప్రేమ మరియు మద్దతు అవసరం. చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు మరియు కష్టతరమైన ప్రసవ పరిస్థితులేవీ ఎదుర్కోరు. చాలావరకు పిల్లలు ఆరోగ్యంగానే జన్మిస్తారు.

అదే సమయంలో, గర్భధారణ అనేది ఒక మహిళ తన జీవితంలో ఎదుర్కొనే ప్రధాన ప్రమాదాల్లో ఒకటి కాగలదు. ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల మంది మహిళలు గర్భధారణ మరియు జనన సమస్యలతో మరణిస్తున్నారు (వీటినే ప్రసూతి మరణాలు అని కూడా పిలుస్తారు). ఎక్కువగా పేద దేశాల్లో ఈ పరిస్థితి ఉంటోంది.

ఈ మరణాల్లో ఎక్కువ వాటిని ప్రాథమిక సంరక్షణతో నిరోధించవచ్చు. గర్భిణీ స్త్రీలు తమను తాము సంరక్షించుకోవడానికి లేదా గర్భిణీల బాగోగులు చూసే వారికి సహాయపడే సమాచారం ఈ అధ్యాయంలో ఉంది.

Sources
  • Audiopedia ID: tel010701