గర్భధారణ సమయంలో నేనెలా మలేరియాను నిరోధించగలను
From Audiopedia
గర్భిణీ స్త్రీలకు మలేరియా చాలా ప్రమాదకరం. మలేరియా నిరోధక చికిత్సలో భాగంగా, మలేరియా ఉండే ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి, మొదటిసారి గర్భం దాల్చిన వారు లక్షణాలు లేనప్పటికీ (లక్షణాలు కనిపించకపోయినప్పటికీ), శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త సిఫార్సు చేసిన విధంగా రెండవ మరియు మూడవ త్రైమాసికంలో మలేరియా నిరోధక మాత్రలు తీసుకోవాలి. మలేరియా నిరోధక మాత్రలు ఏవి తీసుకోవడం ఉత్తమమో ఆరోగ్య కార్యకర్తకు తెలుస్తుంది. క్రిమిసంహారక-చికిత్స చేసిన దోమల వల లోపల గర్భిణీ స్త్రీలు నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం.
ప్లాస్మోడియం ఫాల్సీపెరమ్ మలేరియా సంకేతాలు మరియు లక్షణాలు ఉన్న గర్భిణీ స్త్రీలకు మొదటి త్రైమాసికంలో క్వినైన్ మరియు రెండవ మరియు మూడవ త్రైమాసికంలో ACTలతో శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ద్వారా తక్షణం చికిత్స చేయాలి.