గర్భసంచి జారిపోయే ప్రొలాప్స్ సమస్యను నేనెలా నిరోధించగలను

From Audiopedia
Jump to: navigation, search

ఒక మహిళ తరచుగా గర్భం దాల్చడం, ప్రసవ సమయం సుదీర్ఘంగా ఉండడం లేదా ప్రసవ సమయంలో ఎక్కువగా ముక్కడంవల్ల, గర్భసంచీని పట్టి ఉంచే కండరాలు మరియు స్నాయువులు బలహీనంగా మారవచ్చు. ఇలా జరిగినప్పుడు, గర్భసంచీలోని కొంత భాగం లేదా పూర్తి గర్భసంచీ యోనిలోకి జారిపోవచ్చు. దీనినే ప్రోలాప్స్ లేదా గర్భసంచీ జారిపోవడంగా పిలుస్తారు. మహిళకి తెలియకుండానే మూత్రం కారిపోతూ ఉండడమనేది ప్రోలాప్స్ సంకేతం కావచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉన్న సందర్భాల్లో, గర్భాశయ ముఖద్వార భాగం యోని వద్దే కనిపిస్తుంది.

ఈ పరిస్థితిని నిరోధించడానికి, ప్రసవాల మధ్య కనీసం 2 సంవత్సరాల దూరం ఉండాలి. ప్రసవ సమయంలో, గర్భాశయము పూర్తిగా తెరచుకున్నప్పటికీ, బలంగా ముక్కాల్సిన అవసరం ఉంటేనే ఆ విధంగా చేయండి. శిశువు త్వరగా బయటకు రావడం కోసం కడుపు మీద నొక్కడానికి ఎవరినీ అనుమతించకండి.

Sources
  • Audiopedia ID: tel010208