గర్భస్రావం అనేది నాకు ప్రమాదకరం కాగలదా

From Audiopedia
Jump to: navigation, search

సురక్షితంగా చేసిన గర్భస్రావం అనేది శిశు ప్రసవం కంటే తక్కువ హాని కలిగినదిగా ఉంటుంది. ఇలా చేసినప్పుడు గర్భస్రావం అనేది సురక్షితమైనదిగా ఉండగలదు:

  • శిక్షణ పొందిన మరియు అనుభవం కలిగిన ఆరోగ్య కార్యకర్త ద్వారా.
  • సరైన పరికరాలతో.
  • పరిశుభ్రమైన పరిస్థితులలో. యోనిలోకి మరియు గర్భాశయంలోకి పెట్టే ఏదైనా క్రిమిరహితం (ఎలాంటి సూక్ష్మక్రిములు లేకుండా) చేసి ఉంలి.
  • చివరగా నెలసరి రక్తస్రావం కనిపించిన నాటి నుండి 3 నెలలు (12 వారాలు) లోపల.

గర్భస్రావం ఇలా చేయడం సురక్షితం కాదు:

  • గర్భస్రావం చేయడానికి శిక్షణ పొందని వ్యక్తి ద్వారా.
  • తప్పుడు పరికరాలు లేదా ఔషధాలతో చేయడం.
  • అపరిశుభ్రమైన పరిస్థితుల్లో.
  • గర్భం దాల్చిన 3 నెలలు (12 వారాలు) తర్వాత. (ప్రత్యేక పరికరాలతో ఉన్న ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రిలో చేయనపుడు).

ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం 46 మిలియన్ల గర్భస్రావాలు జరుగుతున్నాయి. అవన్నీ చట్టబద్ధంగా చేసినవి కానప్పటికీ, వాటిలో చాలావరకు సందర్భాల్లో మహిళలు సురక్షితంగానే ఉంటున్నారు. అయితే, అసురక్షిత గర్భస్రావాల వల్ల మరణం లేదా ఇన్ఫెక్షన్, జీవితాంతపు నొప్పి మరియు వంధ్యత్వం లాంటి సమస్యలకు దారితీయవచ్చు. సురక్షిత గర్భస్రావాల కారణంగా, ప్రతి 100,000 మంది మహిళల్లో ఒకరు మాత్రమే చనిపోతుంటే, అసురక్షిత గర్భస్రావాల కారణంగా, ప్రతి 100,000 మంది మహిళల్లో, 100 నుండి 1000 మంది వరకు మరణిస్తున్నారు.

Sources
  • Audiopedia ID: tel020203