గర్భస్రావం తర్వాత నేను ఏ రకమైన కుటుంబ నియంత్రణ పద్ధతి ఎంచుకోవాలి
గర్భస్రావం జరిగిన వెంటనే -2 వారాలు ముగిసే సరికే మీరు మళ్లీ గర్భం దాల్చవచ్చు. చాలా కుటుంబ నియంత్రణ పద్ధతులు పనిచేయడం ప్రారంభించడానికి సమయం పడుతుంది. కాబట్టి, కుటుంబ నియంత్రణ గురించి ఎవరితోనైనా మాట్లాడండి మరియు వీలైనంత త్వరగా క్రింది పద్ధతుల్లో ఒకదాన్ని ఉపయోగించడం ప్రారంభించండి.
పిల్: గర్భస్రావం జరిగిన రోజు నుండే మీరు పిల్స్ తీసుకోవడం ప్రారంభించవచ్చు. ఒక వారం కంటే ఎక్కువ కాలం వేచి ఉండకండి.
ఇంట్రా-యూటెరిన్ డివైస్ (IUD): ఇన్ఫెక్షన్ ప్రమాదం లేనప్పుడు, గర్భస్రావం పూర్తికాగానే శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ద్వారా IUD అమర్చవచ్చు.
ఇంజెక్షన్లు: గర్భస్రావం రోజున లేదా ఒక వారం తర్వాత మొదటి ఇంజెక్షన్ ఇవ్వాలి.
ఇంప్లాంట్‌లు: గర్భస్రావానికి ముందు లేదా తర్వాత లేదా ఒక వారం తర్వాత కూడా ఇంప్లాంట్‌లు వేయవచ్చు.
ఫీమేల్ స్టెరిలైజేషన్: మీ గర్భం వయసు 3 నెలల కంటే తక్కువగా ఉంటే, మీకు గర్భస్రావం సమయంలో లేదా పూర్తయిన వెంటనే స్టెరిలైజేషన్ ప్రక్రియ నిర్వహించవచ్చు. అయితే, ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే, స్టెరిలైజేషన్ అనేది ఒక శాశ్వత కుటుంబ నియంత్రణ ప్రక్రియ.
మేల్ స్టెరిలైజేషన్: పురుషుడికి చేసే స్టెరిలైజేషన్ ప్రక్రియను ఏ సమయంలోనైనా చేయవచ్చు మరియు ఇది శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి కాబట్టి, ఈ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి.
కండోమ్‌లు: గర్భస్రావం ముగిసి, మళ్లీ లైంగిక ప్రక్రియ మొదలుపెట్టగానే మీరు మరియు మీ భాగస్వామి కండోమ్ ఉపయోగించవచ్చు. కండోమ్‌తో HIV సహా STIల నుండి కూడా రక్షణ లభిస్తుంది.
స్పెర్మిసైడ్: మీరు మళ్లీ లైంగిక చర్య మొదలుపెట్టగానే స్పెర్మిసైడ్ ఉపయోగించవచ్చు. మీకు HIV ఉంటే లేదా మీకు చాలామంది భాగస్వాములు ఉంటే స్పెర్మిసైడ్ ఉపయోగించకండి.
డయాఫ్రాగమ్: ఇన్ఫెక్షన్ లేదా గాయం లేకపోతే, గర్భస్రావం తర్వాత మీరు డయాఫ్రాగమ్ అమర్చుకోవచ్చు.
సహజ పద్ధతులు (శ్లేష్మం గమనించడం మరియు రోజులు లెక్కించడం): మీ నెలసరి రక్తస్రావం మళ్లీ మామూలు స్థితికి వచ్చే వరకు ఈ పద్ధతులు పనిచేయవు.