గర్భిణీ స్త్రీలకు మలేరియా అత్యంత ప్రమాదకరం అనడానికి కారణమేమిటి

From Audiopedia
Jump to: navigation, search

గర్భిణీ స్త్రీలు ఇతర మహిళల కంటే మలేరియాతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో, ప్రత్యేకించి, మొదటి గర్భధారణ సమయంలో ఈ వ్యాధి మరింత ప్రమాదకరం కాగలదు. గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో జరిగే మార్పుల కారణంగా, మలేరియాను ఎదుర్కోవడంలో ఆమెకు మునుపటి స్థాయి నిరోధకత ఉండదు. మలేరియా కారణంగా తీవ్రమైన రక్తహీనత ('రక్తం పలుచబడడం'), గర్భస్రావం, అకాల జననం లేదా మృత శిశు జననం సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో మలేరియాతో బాధపడిన తల్లులకు జన్మించిన శిశువులు తరచుగా తక్కువ బరువుతో ఉంటారు. తద్వారా, ఆ శిశువులు వారి మొదటి సంవత్సరంలో ఇన్ఫెక్షన్లకు లేదా మరణానికి గురయ్యే అవకాశం మరింతగా ఉంటుంది.

మలేరియా ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో మొదటిసారి గర్భం ధరించే మహిళల్లో తరచుగా మలేరియా సంబంధిత విలక్షణ సంకేతాలు కనిపించవు.

Sources
  • Audiopedia ID: tel011702