చర్మ సమస్యలను నేను ఏవిధంగా నిరోధించగలను
కనీసం ప్రతి 2 గంటలకు ఒకసారి కదిలే ప్రయత్నం చేయండి. మీరు అన్ని సమయాల్లో పడుకుని ఉన్నట్లయితే, మీ స్థానం మార్చుకోవడం కోసం ఎవరినైనా సహాయం కోరండి.
ఎముక భాగాల మీద ఒత్తిడి తగ్గించే విధంగా మృదువైన ఉపరితలాల మీద పడుకోండి లేదా కూర్చోండి. ఎముక భాగాల చుట్టూ ఖాళీ ప్రాంతాల క్రింద కుషన్ లేదా స్లీపింగ్ ప్యాడ్ ఉంచడం సహాయపడగలదు లేదా ఉడికించని గింజలు మరియు బియ్యంతో నింపిన ప్లాస్టిక్ సంచీతో చేసిన సాధారణ కుషన్ లేదా స్లీపింగ్ ప్యాడ్ ఉపయోగించండి. ఇలా చేసినప్పుడు, నెలకు ఒకసారి సంచీలో కొత్త బియ్యం మరియు గింజలు నింపాలి.
ప్రతిరోజూ మీ మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ వెనుక వైపు చూడటానికి మీరు అద్దం ఉపయోగించవచ్చు. మీ చర్మం మీద ఎక్కడైనా నల్లటిలేదా ఎర్రటి ప్రదేశం గమనిస్తే, మీ చర్మం సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ ప్రాంతం మీద ఎటువంటి ఒత్తిడి పడకుండా ఉండేలా ప్రయత్నించండి.
పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు పుష్కలంగా తినడానికి ప్రయత్నించండి.
నెలసరి రక్తస్రావం సమయంలో, స్రావం పీల్చుకోవడం కోసం మీ యోని లోపల వస్త్రం లేదా టాంపాన్లు చొప్పించకండి. అవి మీ శరీరం లోపలి మీ ఎముకలను నొక్కవచ్చు మరియు మీ యోనిలో గాయం కలిగించవచ్చు.
ప్రతిరోజూ స్నానం చేయడానికి ప్రయత్నించండి. మీ చర్మాన్ని పొడిగా ఉంచుకోండి కానీ, రుద్దకండి. లోషన్లు లేదా నూనెలు నివారించండి. ఎందుకంటే, అవి మీ చర్మాన్ని మృదువుగా మరియు బలహీనంగా చేస్తాయి. అలాగే మీ చర్మం మీద ఎప్పుడూ ఆల్కహాల్ ఉపయోగించకండి.