చిన్న పిల్లలకు 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు నేను ఏవిధంగా తినిపించాలి
మొదటి ఆరు నెలల్లో, శిశువుకు ఎక్కువ ప్రమాద పరిస్థితిలో ఉంటుంది కాబట్టి, తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల అతిసారం మరియు ఇతర సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది మరియు శిశువు జీవితంలో మంచి ప్రారంభాన్ని అందిస్తుంది.
6 నెలల వయస్సులో, బిడ్డకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారాలు మరియు పానీయాలు అవసరం. పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన శక్తి, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఇతర పోషకాలను ఇవి అందిస్తాయి.
వివిధ రకాల ఆహారాలు-కూరగాయలు మరియు పండ్లు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు మరియు పాల ఉత్పత్తులు లాంటివి పిల్లల పోషకాహార అవసరాలు తీర్చడానికి సహాయపడతాయి. రెండు సంవత్సరాల వరకు మరియు ఆ తర్వాత కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల వ్యాధి నుండి రక్షించే పోషకాల కీలక వనరు లభిస్తుంది.
మృదువైన, పాక్షిక-ఘన లేదా ఘన ఆహారాలు ఇవ్వడం బాగా ఆలస్యం చేస్తే, బిడ్డకు అవసరమైన పోషకాలు లభించకపోవచ్చు. దీనివల్ల పెరుగుదల మరియు వికాసం మందగించవచ్చు. ఘనాహారాలు పరిచయం చేసేటప్పుడు మృదువైన, మెత్తటి ఆహారాలతో ప్రారంభించి, క్రమంగా మరింత ఘనాహారాలకు మారడం చాలా ముఖ్యం. ఆరోగ్యకర ఆహారాల వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే, పిల్లల ఆహారం మరింత సమతుల్యంగా మరియు పోషకమైనదిగా ఉంటుంది.
ఆహారాల స్థిరత్వం మరియు విభిన్నత అనేవి పిల్లల అవసరాలు మరియు వారి ఆహార సామర్ధ్యాలకు అనుగుణంగా ఉండాలి. 6 నెలల వయస్సులో శిశువులకు జావ లాంటి లేదా మెత్తని ఆహారాలు, చిక్కటి సూప్‌లు మరియు గంజి లాంటివి తినిపించవచ్చు. 8 నెలల నాటికి చాలా మంది శిశువులు 'ఫింగర్ ఫుడ్స్' (పిల్లలు స్వయంగా తినగలిగే స్నాక్స్) కూడా తినగలరు. 12 నెలల నాటికి, చాలామంది పిల్లలు మిగిలిన కుటుంబ సభ్యులు తీసుకునే అదే ఆహారం తినగలరు.
గింజలు, ద్రాక్ష మరియు ముడి క్యారెట్లు మరియు పిల్లల గొంతులో చిక్కుకోవడం ద్వారా వారికి ఊపిరి ఆడని స్థితి కలిగించగల ఆకారం మరియు/లేదా స్థిరత్వం కలిగిన ఇతర ఆహారాలు పిల్లలకు చిక్కకుండా తల్లిదండ్రులు లేదా ఇతర సంరక్షకులు జాగ్రత్త వహించాలి.