చిరిగిపోవడం మరియు కోతలు విషయంలో నేనేం చేయవచ్చు

From Audiopedia
Jump to: navigation, search

కొన్నిసార్లు అత్యాచారం వల్ల జననేంద్రియాల్లో చర్మం చిరిగిపోవడం మరియు కోతలు ఏర్పడడం వల్ల నొప్పిగా ఉంటుంది. అయితే, ఆ నొప్పి కాలక్రమేణా పోతుంది. రక్తస్రావం తీవ్రంగా ఉంటే, చిరిగిపోయిన చర్మానికి కుట్లు వేయడం కోసం శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తను మీరు సంప్రదించాలి.

చిన్నపాటి కోతలు మరియు గాయాలు కోసం:

  • మరగబెట్టి, చల్లార్చిన వెచ్చని నీటిలో రోజుకు 3 సార్లు మీ జననేంద్రియాలు ఉంచండి. నీళ్లు మరిగే సమయంలో అందులో చమోమిలే ఆకులు వేయడం వల్ల గాయాల నుండి ఉపశమనానికి మరియు స్వస్తతకు సహాయపడుతుంది. కలబంద మొక్క రసాన్ని కూడా మీరు గాయాల మీద పూయవచ్చు.
  • మూత్రం పోస్తున్నప్పుడు మంట కలగకుండా ఉండడానికి, ఆసమయంలో, మీ జననేంద్రియాల మీద నీళ్లు పోయండి. ఎక్కువగా ద్రవాలు తాగడం వల్ల మూత్రం గాఢత తగ్గి, మంట తక్కువగా ఉంటుంది.
  • ఇన్ఫెక్షన్ సంకేతాల కోసం చూడండి:

గాయపడిన ప్రదేశం వేడిగా ఉండడంతో పాటు, పసుపు రంగు ద్రవం (చీము) కారుతూ, చెడు వాసన మరియు నొప్పి ఉంటే, పరిస్థితి తీవ్రం కావచ్చు.

  • హింసాత్మక సెక్స్ తర్వాత మహిళలకు మూత్రాశయం లేదా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ రావడం కూడా సాధారణమే.
Sources
  • Audiopedia ID: tel020318