చెత్తను సురక్షిత మార్గంలో నేనెలా తొలగించవచ్చు
మీ సమాజంలో చెత్త సేకరణ పద్ధతి లేకపోతే, ప్రతి కుటుంబానికి చెత్త గొయ్యి అవసరం, ఇంటి చెత్తను ప్రతిరోజూ అందులో వేసి పూడ్చేస్తారు లేదా కాల్చివేస్తారు. సాధ్యమైతే, చెత్తను పూడ్చండి, కంపోస్ట్‌గా మార్చండి లేదా కాల్చేయండి. చెత్తను మీరు పాతిపెడితే, జంతువులు మరియు కీటకాలకు ఆ చెత్తను దూరంగా ఉంచడం కోసం ఆ గొయ్యి లోతుగా ఉందని నిర్ధారించుకోండి. చెత్త నేల మీదే ఉంటే, ఈగలు వాలడం నిరోధించడం కోసం చెత్త చుట్టూ కంచె వేసి, దానిని మట్టితో కప్పండి. మీ పంట భూములను సారవంతం చేయడానికి కంపోస్ట్‌గా మార్చిన ఆహార వ్యర్థాలు ఉపయోగించండి. అలాగే, ప్రమాదకర మరియు విషపూరిత పదార్థాలు వదిలించుకోవడానికి సురక్షిత మార్గాలు కనుగొనండి. ఉదాహరణకు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చకండి. కాల్చడం వల్ల వచ్చే పొగలు విషపూరితమైనవి. ప్రత్యేకించి, పిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి అది ప్రమాదకరం కాగలదు.