ట్యూబెక్టమీ మహిళకు చేసే శస్త్రచికిత్స గురించి నేనేం తెలుసుకోవాలి
From Audiopedia
ట్యూబెక్టమీ అనేది వాసెక్టమీ కంటే కొంచెం క్లిష్టమైన శస్త్రచికిత్స అయినప్పటికీ, పూర్తిగా సురక్షితమైనదే. దీనికి సుమారుగా 30 నిమిషాలు పడుతుంది.
శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ఈ శస్త్రచికిత్స చేయగలరు. స్త్రీలో అండాలను గర్భాశయంలోకి తీసుకువెళ్ళే గొట్టాలను కత్తిరించడం కోసం లేదా వాటిని గట్టిగా కట్టేయడం కోసం బొడ్డుకి సమీపంలోని చర్మం గుండా ఒక సాధనాన్ని చొప్పిస్తారు. మహిళ నెలసరి రక్తస్రావం తీరును లేదా లైంగిక పరంగా ఆమె సామర్థ్యాన్ని మరియు ఆనందాన్ని ఇది మార్చదు.