ట్రాఫిక్ గాయాల నుండి నేను నా పిల్లలను ఎలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

పిల్లలు రహదారులు దాటుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు లేదా రహదారుల దగ్గర్లో ఆడుకుంటున్నప్పుడు గాయపడవచ్చు. చిన్న పిల్లలు రోడ్డుపైకి పరుగెత్తే ముందు ఏమాత్రం ఆలోచించరు. కుటుంబాలు తప్పనిసరిగా ఇలా చేయాలి:

  • పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.
  • చిన్నపిల్లలు రోడ్డుపైకి పరుగెత్తకుండా నిరోధించడానికి ఇంటి చుట్టూ కంచె వేసి, గేటు పెట్టి, దానికి తాళం వేయాలి.
  • పెద్దవాళ్లు లేదా పెద్ద పిల్లలు తోడు లేకుండా రోడ్డు మీద నడవకూడదని మరియు రోడ్డు దాటకూడదని చిన్నపిల్లలకు నేర్పించాలి.
  • పిల్లలు రోడ్డు దగ్గర్లో ఆడుకోకుండా చూడాలి.
  • రోడ్డు మీద బంతి వెంట పరిగెత్తడం, కదిలే బొమ్మలతో ఆడుకోవడం లేదా గాలిపటాలు ఎగురవేయడం చేయకూడదని పిల్లలకు చెప్పాలి.
  • ట్రాఫిక్‌కి ఎదురువైపుగా, రోడ్డు పక్కన మాత్రమే నడవాలని పిల్లలకు సూచించాలి.
  • నడకదారులు ఉన్నప్పుడు, రోడ్డు మీద కాకుండా వాటి మీదే నడవాల్సిందిగా పిల్లలకు నేర్పించాలి.
Sources
  • Audiopedia ID: tel020602