డయాఫ్రాగమ్‌ని నేనెలా ఉపయోగించాలి

From Audiopedia
Jump to: navigation, search

1. మీ వద్ద స్పెర్మిసైడ్ ఉంటే, దానిని డయాఫ్రాగమ్ మధ్యలో పిండండి. తర్వాత, అందులో నుండి మీ వేలితో కొంచెం తీసుకుని డయాఫ్రాగమ్ అంచు చుట్టూ పూయండి.

2. డయాఫ్రాగమ్‌ని మధ్యలో పట్టుకుని పిండినట్లుగా చేయండి.

3. మరొక చేతితో మీ యోని పెదవులు తెరవండి. డయాఫ్రాగమ్‌ని మీ యోనిలోకి నెట్టండి. మీరు దానిని బాగా వెనక్కి నెడితే, అది ఉత్తమంగా పనిచేస్తుంది.

4. మీ వేళ్లలో ఒకదాన్ని మీ యోని లోపలకు చొప్పించి, డయాఫ్రాగమ్ రబ్బరు పొర మీదుగా మీ గర్భాశయం ముఖద్వారాన్ని తాకి, అనుభూతి చెందడం ద్వారా మీరు మీ డయాఫ్రాగమ్ స్థానాన్ని తనిఖీ చేయాలి. గర్భాశయ ముఖద్వారం మీ ముక్కు కొనలాగా దృఢంగా అనిపిస్తుంది. మీ డయాఫ్రాగమ్ మీ గర్భాశయం ముఖ ద్వారాన్ని పూర్తిగా కప్పేయాలి.

5. డయాఫ్రాగమ్ సరైన స్థలంలో ఉన్నప్పుడు, అది మీ యోనిలో ఉన్నట్టు కూడా మీకు అనిపించదు.

6. సెక్స్ తర్వాత కనీసం 6 గంటల పాటు డయాఫ్రాగమ్‌ని లోపలే ఉంచేయండి.

డయాఫ్రాగమ్‌ని మీరు 24 గంటల వరకు కూడా లోపలే ఉంచవచ్చు. నెలసరి రక్తస్రావం సమయంలోనూ మీరు డయాఫ్రాగమ్ ఉపయోగించవచ్చు. కానీ, వస్త్రం లేదా ప్యాడ్ మార్చినంత తరచుగా మీరు దానిని బయటకు తీసి, శుభ్రం చేయాల్సి ఉంటుంది.

డయాఫ్రాగమ్ తొలగించడానికి:

మీ వేలిని మీ యోని లోపలకు చొప్పించండి. డయాఫ్రాగమ్ ముందు అంచులోని వెనుక భాగానికి చేరుకోండి మరియు దానిని క్రిందికి నొక్కినట్టుగా చేసి, బయటకు లాగండి. కొన్నిసార్లు మీరు మలవిసర్జన సమయంలో ముక్కినట్టుగా చేయడం కూడా ఇందుకు సహాయపడగలదు. మీ డయాఫ్రాగమ్‌ని సబ్బు మరియు నీటితో కడిగి, ఎండబెట్టండి. డయాఫ్రాగమ్‌ని వెలుగు వస్తున్న వైపు పట్టుకోవడం ద్వారా, అందులో ఏవైనా రంధ్రాల కోసం తనిఖీ చేయండి. ఒక చిన్న రంధ్రం ఉన్నా సరే, దాన్ని పడేసి, కొత్తది కొనండి. డయాఫ్రాగమ్‌ని శుభ్రమైన, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.

Sources
  • Audiopedia ID: tel020414