డయాఫ్రాగమ్ గురించి నేనేం తెలుసుకోవాలి
డయాఫ్రాగమ్ అనేది మృదువైన రబ్బరు లేదా పలుచటి సిలికాన్‌తో తయారుచేసిన ఒక లోతు తక్కువగా ఉండే కప్పు లాంటి నిర్మాణం. ఒక మహిళ సెక్స్ సమయంలో దీనిని ఆమె యోనిలో పెట్టుకోవచ్చు. డయాఫ్రాగమ్ అనేది గర్భాశయాన్ని కప్పి ఉంచుతుంది. తద్వారా, పురుషుడి స్పెర్మ్ ఆమె గర్భాశయంలోకి ప్రవేశించదు.
డయాఫ్రాగమ్‌ని సరిగ్గా ఉపయోగిస్తే, అది చాలావరకు గర్భధారణను నిరోధించడంతో పాటు STIల నుండి కూడా కొంతమేర రక్షణ అందిస్తుంది. డయాఫ్రాగమ్‌ను స్పెర్మిసైడ్‌తో కలిపి ఉపయోగించాలి. మీ వద్ద స్పెర్మిసైడ్ లేనప్పుడు కూడా డయాఫ్రాగమ్ ఉపయోగించవచ్చు. కానీ, ఆసమయంలో, అది గర్భం నిరోధించే పనిని గొప్పగా చేయకపోవచ్చు.
డయాఫ్రాగమ్‌లు వివిధ పరిమాణాల్లో లభిస్తాయి మరియు కొన్ని ఆరోగ్య కేంద్రాలు మరియు కుటుంబ నియంత్రణ ఆసుపత్రుల్లో కూడా లభిస్తాయి. కటి పరీక్షలు చేయడానికి శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త మిమ్మల్ని పరీక్షించడం ద్వారా, మీకు సరిపోయే సరైన డయాఫ్రాగమ్ సైజుని సిఫార్సు చేయగలరు. సరైన పరిమాణంలోని డయాఫ్రాగమ్ ఉపయోగించినప్పుడు మాత్రమే అది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
డయాఫ్రాగమ్‌లకు రంధ్రాలు పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి, ఒక సంవత్సరం పైగా ఉపయోగించిన తర్వాత ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి, మీ డయాఫ్రాగమ్‌ని తరచుగా తనిఖీ చేయడం మంచి ఆలోచన కాగలదు. రబ్బరు ఎండిపోయినప్పుడు లేదా గట్టిపడిననప్పుడు లేదా దానిలో రంధ్రం ఉన్నప్పుడు దాన్ని మార్చేయాలి.
సెక్స్‌కి ముందు లేదా దాదాపు 6 గంటల ముందే మీరు మీ లోపలకి డయాఫ్రాగమ్ చొప్పించవచ్చు. మీరు డయాఫ్రాగమ్ ఉంచుకున్న తర్వాత, ఒకటి కంటే ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొంటే, డయాఫ్రాగమ్ తొలగించకుండానే, ప్రతిసారి సెక్స్‌కి ముందు మీ యోనిలోకి ఎక్కువ మొత్తంలో స్పెర్మిసైడ్ పూయండి.