తగినంత కాల్షియం అందుకుంటున్నానని నేనెలా నిర్ధారించుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ప్రతి ఒక్కరికీ వారి ఎముకలు మరియు దంతాలు బలంగా ఉండడానికి కాల్షియం అవసరం. అదేసమయంలో, బాలికలు మరియు మహిళలకు అదనపు కాల్షియం అవసరం:

  • బాల్యంలో. ఒక అమ్మాయి తుంటిభాగం పూర్తి స్థాయిలో ఎదగడానికి కాల్షియం కావాలి. అప్పుడే వాళ్లు పెద్దయ్యాక సురక్షితంగా ప్రసవించగలరు.
  • గర్భధారణ సమయంలో. శిశువులో ఎముకలు చక్కగా పెరగడానికి మరియు గర్భిణీ స్త్రీలో ఎముకలు మరియు దంతాలు బలంగా ఉండడానికి కాల్షియం అవసరం.
  • తల్లిపాలు ఇచ్చే సమయంలో. రొమ్ము పాలు తయారుకావడానికి కాల్షియం అవసరం.
  • మధ్య వయస్సు మరియు వృద్ధాప్యంలో. బలహీనమైన ఎముకలు (ఆస్టియోపోరోసిస్) నివారించడానికి కాల్షియం అవసరం.

ఈ ఆహారాల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది:

  • పాలు, పెరుగు, యోగర్ట్
  • ఎముకల పులుసు
  • ఆకుపచ్చ ఆకుకూరలు
  • జున్ను
  • నువ్వులు
  • బాదం
  • సున్నం (కార్బన్ బూడిద)

తీసుకునే ఆహారం నుండి మీకు లభించే కాల్షియం మొత్తం పెంచడానికి:

  • ఎముకలు లేదా గుడ్డు పెంకులను వెనిగర్ లేదా నిమ్మరసంలో కొన్ని గంటలు నానబెట్టి, ఆ ద్రవాన్ని సూప్ లేదా ఇతర ఆహారాల్లో ఉపయోగించండి.
  • సూప్ కోసం ఎముకలు ఉడికించే సమయంలో కొద్దిగా నిమ్మరసం, వెనిగర్ లేదా టమోటా కలపండి.
  • గుడ్డు పెంకులను మెత్తటి పొడిగా చేసి, వంటల్లో ఉపయోగించండి.
  • మొక్కజొన్నను సున్నం (కార్బన్ బూడిద)లో నానబెట్టండి
  • మీ శరీరం కాల్షియంను చక్కగా వినియోగించుకోవడానికి సూర్యరశ్మి సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ఎండలో ఉండటానికి ప్రయత్నించండి. ఆరుబయట ఉంటే చాలదు. సూర్యకిరణాలు మీ చర్మాన్ని తాకాలని గుర్తుంచుకోండి.
Sources
  • Audiopedia ID: tel010407