తగినంత విటమిన్-ఏ నాకు అందుతోందని నేనెలా నిర్ధారించుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

విటమిన్-ఏ రేచీకటిని నివారిస్తుంది మరియు కొన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. చాలామంది గర్భిణీ స్త్రీలకు రేచీకటి సమస్యలు ఉంటాయి. అంటే, వాళ్లు గర్భవతి కావడానికి ముందు వారి ఆహారంలో విటమిన్-ఏ లోపించిందని అర్థం. గర్భధారణతో శరీరం నుండి అదనపు డిమాండ్లు ఎదురైనప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది.

విటమిన్-ఏ లోపం వల్ల పిల్లల్లో అంధత్వానికి కారణమవుతుంది. గర్భధారణ సమయంలో విటమిన్-ఏ అధికంగా ఉండే ఆహారం తినడం ద్వారా, ఒక మహిళ తన బిడ్డకు ఇచ్చే పాలలో లభించే విటమిన్-ఏ మొత్తం పెంచవచ్చు.

ముదురు పసుపు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు మరియు కొన్ని నారింజ పండ్లలో విటమిన్-ఏ సమృద్ధిగా ఉంటుంది.

Sources
  • Audiopedia ID: tel010410