తల్లిపాలు ఇచ్చే సమయంలో నేనేం తినాలి
గర్భం సంబంధిత పరిస్థితిలు నుండి కోలుకోవడానికి, శిశువు సంరక్షణ చూసుకోవడానికి మరియు తాము చేసే అన్ని ఇతర పనులు మొదలుపెట్టడానికి బాలింతలు బాగా ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు, కొవ్వులు సంవృద్ధంగా ఉండే ఆహారంతో పాటు పెద్ద మొత్తంలో పండ్లు మరియు కూరగాయలు తినాలి. పుష్కలంగా ద్రవాలు-శుభ్రమైన నీళ్లు, పాలు, మూలికలతో చేసిన టీలు మరియు పండ్ల రసాలు తీసుకోవాలి. అయితే, ఒక మహిళ ఎంత తింటోంది, ఎంత త్రాగుతోందనే దానితో సంబంధం లేకుండా, ఆమె శరీరంలో తల్లిపాలు తయారవుతాయి.
ఆకలి మరియు దాహం తీర్చుకోవడానికి తగినంత తినండి మరియు త్రాగండి. మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు మరియు అనవసర ఔషధాలకు దూరంగా ఉండండి. కాఫీ మరియు సోడాల కంటే శుభ్రమైన నీళ్లు, పండ్లు మరియు కూరగాయల రసాలు మరియు పాలు మరియు మూలికా టీలు మంచివి.
బాలింతలు కొన్ని ఆహారాలు తినకూడదని కొందరు నమ్ముతుంటారు. అయితే, బాలింతకి సమతుల్య ఆహారం లభించకపోతే, ఆమెకి పోషకాహార లోపం, రక్తం తగ్గిపోవడం (రక్తహీనత) మరియు ఇతర వ్యాధులు ఎదురవుతాయి.
కొన్నిసార్లు, పాలిచ్చే తల్లికి ప్రత్యేక ఆహారాలు ఇస్తుంటారు. ఆ ఆహారాలు పోషకాలతో నిండినవైతే, అలాంటి పద్ధతులు మంచివి కాగలవు. ప్రసవం తర్వాత, మహిళకి మంచి ఆహారం ఇవ్వడం వల్ల ఆమె శరీరం త్వరగా ఆరోగ్యంగా మరియు బలంగా తయారుకావడానికి సహాయపడుతుంది. క్రింది పరిస్థితుల్లో, మహిళకు అదనపు ఆహారం అవసరం: