తల్లిపాలు ఇవ్వడాన్ని నేను ఎప్పుడు ఆపేయాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

క్రింది పరిస్థితుల్లో ఇతర ఆహారాలు తీసుకోవడానికి శిశువు సిద్ధమవుతుంది:

  • శిశువుకి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చినప్పుడు.
  • కుటుంబ సభ్యుల నుండి లేదా టేబుల్ మీద నుండి ఆహారం తీసుకోవడాన్ని శిశువు ప్రారంభించినప్పుడు.
  • నోట్లో పెట్టిన ఆహారాన్ని నాలుకతో బయటకు నెట్టనప్పుడు.

6 నెలల నుండి 1 సంవత్సరం మధ్య కాలంలో, శిశువు కోరుకున్నప్పుడు తల్లిపాలు ఇస్తే సరిపోతుంది. 4 నెలల కంటే ముందు ఇతర ఆహారాలేవీ శిశువుకి పెట్టకండి. శిశువు ఇతర ఆహారాలు తింటున్నప్పటికీ, అందుకుముందు లాగే శిశువుకి ఎక్కువ మొత్తంలో తల్లిపాలు అవసరం. మొదట్లో ఇతర ఆహారాలతో పాటు రోజుకు 2 లేదా 3 సార్లు తల్లిపాలు ఇవ్వండి. తృణధాన్యాలు లేదా గంజి లాంటి మృదువైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో ప్రారంభించండి. కొందరు మహిళలు వీటిని తల్లిపాలుతో కలుపుతారు. అలాంటప్పుడు ఖరీదైన శిశు ఉత్పత్తులు అవసరం లేదు.

శిశువు సంతోషంగా కనిపించకపోతే లేదా తల్లిపాలుతో శిశువు కడుపు నిండినట్టుగా అనిపించకపోతే, శిశువు వయసు 4 నుండి 6 నెలలుగా ఉంటే, శిశువు కడుపు నిండడం కోసం ఎక్కువసార్లు తల్లి రొమ్ములు చప్పరించాలి. అంటే, అలాంటి శిశువుకి తల్లి 5 రోజుల పాటు తరచుగా తల్లిపాలు ఇవ్వాలి. అప్పటికీ, శిశువు సంతోషంగా కనిపించకపోతే, అప్పుడు ఆమె తన శిశువు కోసం ఇతర ఆహారాలు ప్రయత్నించవచ్చు. శిశువు తనకు తానే నమిలి తినే వరకు అన్ని ఆహార పదార్థాలను మెత్తగా పిసికి పెట్టండి. శిశువుకి ఆహారం పెట్టడం కోసం ఒక కప్పు లేదా గిన్నె మరియు చెంచా ఉపయోగించండి.

శిశువులు తరచుగా, అంటే, రోజుకి సుమారుగా 5 సార్లు తినాలి. ప్రతిరోజూ, వారికి కొన్ని ప్రధాన ఆహారాలు (గంజి, జొన్న, గోధుమలు, బియ్యం, చిరుధాన్యాలు, బంగాళాదుంప, కర్రపెండలం), శరీర నిర్మాణం కోసం ఆహారం (బీన్స్, మెత్తగా పిండి చేసిన గింజలు, గుడ్లు, జున్ను, మాంసం లేదా చేపలు), ముదురు రంగు కూరగాయలు మరియు పండ్లు మరియు శక్తినిచ్చే ఆహారం (మెత్తగా పిండి చేసిన గింజలు, చెంచాడు నూనె, వనస్పతి లేదా వండి కొవ్వులు) ఇవ్వాలి. మీరు రోజూ 5 సార్లు వంట చేయవలసిన అవసరం లేదు. కొన్ని ఆహారాలను చల్లటి చిరుతిండిగా కూడా తినిపించవచ్చు.

ఒకసారికి ఒక కొత్త ఆహారం మాత్రమే పెట్టండి. సుమారుగా 9 నెలల నుండి 1 సంవత్సరం వరకు వయసులో, కుటుంబంలో చేసే ఆహార పదార్థాలను ముక్కలుగా చేసి, తినడానికి సులభంగా ఉండేలా అందిస్తే, శిశువు చాలావరకు సులభంగా తినేస్తుంది.

రెండవ సంవత్సరంలో కూడా, తల్లిపాలు కొనసాగిస్తే, మీ బిడ్డకు ఇన్ఫెక్షన్లు మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కొనసాగుతుంది. మీకు వీలైతే, మీకు మరొక బిడ్డ ఉన్నప్పటికీ, మీ మొదటి బిడ్డకు కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు కొనసాగించండి. చాలామంది పిల్లలు వాళ్లే నెమ్మదిగా తల్లిపాలు మానేస్తారు.

Sources
  • Audiopedia ID: tel010806