త్రాగడానికి మరియు వంట చేయడానికి ఉపయోగించే నీటిని ఎలా శుభ్రంగా ఉంచవచ్చు

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

పరిశుభ్రమైన తాగునీరు అనేది విరేచనాలు మరియు పరాన్నజీవులను నిరోధించడంలో సహాయపడుతుంది. ప్రజలు సులభంగా నీళ్లు పొందడం కోసం నీటి వనరు సమాజానికి దగ్గరగా ఉండాలి. తాగునీరు మరియు వంటకి ఉపయోగించే నీళ్లను పరిశుభ్రంగా ఉంచడానికి:

  • జంతువులను నీటి వనరు దగ్గరకు వెళ్లనివ్వవద్దు. అవసరమైతే, వాటిని దూరంగా ఉంచడం కోసం కంచె నిర్మించండి.
  • నీటి వనరు సమీపంలో స్నానం చేయడం లేదా బట్టలు ఉతకడం చేయకండి, వంట పాత్రలు, లేదా తినడానికి ఉపయోగించే పాత్రలు కడగకండి.
  • నీటి వనరుల వద్ద మల, మూత్ర విసర్జన చేయకండి లేదా నీటి వనరు సమీపంలో చెత్త (వ్యర్థాలు) వేయకండి.


Sources
  • Audiopedia ID: tel010105