దగ్గు జలుబు మరియు మరింత తీవ్రమైన అనారోగ్యాల గురించి నేనేం తెలుసుకోవాలి
చిన్న పిల్లల జీవితాల్లో దగ్గు, జలుబు, గొంతు నొప్పి మరియు ముక్కు కారడం సర్వసాధారణం.
కొన్ని సందర్భాల్లో, దగ్గు అనేది న్యుమోనియా లేదా క్షయవ్యాధి లాంటి అత్యంత తీవ్రమైన అనారోగ్యాలకు ప్రమాద సంకేతం కావచ్చు. వేగంగా ఊపిరి పీల్చుకుంటున్న లేదా ఇబ్బంది పడుతున్న పిల్లల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌గా చెప్పే న్యుమోనియా ఉండవచ్చు. ఇదొక ప్రాణాంతక వ్యాధి. ఆ చిన్నారికి శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ద్వారా తక్షణ చికిత్స అవసరం. ఇతర ఏదైనా చికిత్స అవసరమైతే, ఆ కార్యకర్త సూచిస్తారు.
ప్రపంచంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు బాలికలు మరియు బాలురులో మరణానికి న్యుమోనియా ప్రధాన కారణంగా ఉంటోంది. దీనికంటే ముందుస్థానంలో విరేచనాలు (డయేరియా) ఉంటోంది. ప్రతి సంవత్సరం సుమారు 2 మిలియన్ల మంది పిల్లలు న్యుమోనియాతో మరణిస్తున్నారు. ఎయిడ్స్, మలేరియా మరియు తట్టు వ్యాధి కారణంగా మరణిస్తున్న పిల్లల మొత్తం సంఖ్య కంటే న్యుమోనియా వల్లే ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో చనిపోతున్న ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వల్లే చనిపోతున్నారు.