దుర్వినియోగం నిరోధించడంలో నేను నా పిల్లలకు ఎలా సహాయపడగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

  • వారిని లైంగికేచ్ఛతో తాకే అవకాశం గురించి మీ పిల్లలకు నేర్పండి. ప్రేమపూర్వకంగా తాకడం మరియు లైంగికేచ్ఛతో తాకడం మధ్య వ్యత్యాసం గురించి నేర్పండి.
  • వీలైతే, అమ్మాయిలు మరియు అబ్బాయిలు విడివిడిగా నిద్రపోయేలా చేయండి. ముఖ్యంగా ,10 లేదా 11 సంవత్సరాల వయస్సు తర్వాత నుండి.
  • వారికి ఏదైనా జరిగినప్పుడు వాళ్లు ఆ విషయమై ఎవరితో మాట్లాడాలో మీ పిల్లలకు తెలుసని నిర్ధారించుకోండి.
  • ఎవరైనా పెద్దవారితో లేదా పెద్ద వయసు పిల్లల్తో ఉండడం తనకు ఇబ్బందిగా ఉందని పిల్లలు చెబితే, ఆ వ్యక్తి ఎవరైనా సరే, పిల్లలు చెప్పే మాట నమ్మండి.
  • కొన్నిసార్లు పిల్లల మీద దుర్వినియోగం చాలా సంవత్సరాలు కొనసాగుతుంది. ఒక అమ్మాయి దాని గురించి ఎవరికైనా చెబితే ఆమెకు హాని జరుగుతుందని లేదా చంపేస్తామని కూడా ఆమెని భయపెట్టి ఉండవచ్చు.
Sources
  • Audiopedia ID: tel020309