దుస్తులు ఉతికే మహిళగా పనిచేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నేనెలా నిరోధించగలను

From Audiopedia
Jump to: navigation, search

వీలైతే, మీ చేతులు రక్షించుకోవడానికి రబ్బరు లేదా ప్లాస్టిక్ చేతి తొడుగులు ఉపయోగించండి.

మీ చేతులను వీలైనంత పొడిగా ఉంచుకోండి. మీరు పని పూర్తి చేసిన తర్వాత కలబంద మొక్క నుండి లోషన్ లేదా చిక్కటి రసం తీసి చేతులకు పూయండి. మీ గోర్లు మందంగా లేదా దెబ్బతినడం మొదలైతే, వెంటనే వాటిని జెంటియన్ వైలెట్‌తో పెయింట్ చేయడానికి ప్రయత్నించండి.

సింక్ పక్కన ఒక గిన్నెలో చల్లని బ్లాక్ టీ లేదా వెనిగర్ నీళ్లు (పావు భాగం నీటిలో ఒక మూత వెనిగర్) ఉంచడానికి ప్రయత్నించండి. మీరు సబ్బు ఉపయోగించిన ప్రతిసారీ, మీ చేతులను టీ లేదా వెనిగర్‌లో ఒక నిమిషం నానబెట్టండి. దద్దుర్లు, కాలిన గాయాలు లేదా దురద లాంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కోసం మీ ప్రాంతంలో ఉపయోగించే తాజా మొక్కల రసాలు ఉపయోగించండి. తాజా మొక్కలు సేకరించి కడిగి, వాటి మీద నీళ్లు పోస్తూ మెత్తటి పేస్టుగా రుబ్బండి. వీలైనంత తరచుగా ఈ మిశ్రమంలో మీ చేతులు ఉంచండి.

Sources
  • Audiopedia ID: tel030129