ధనుర్వాతం ఇన్ఫెక్షన్‌ను నేనెలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ధనుర్వాతం అనేది మరణానికి దారితీయగల ఇన్ఫెక్షన్. మనుష్యుల లేదా జంతువుల మలంలో ఉండే ధనుర్వాతం కారక క్రిమి శరీర గాయం ద్వారా మహిళ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఆ మహిళకి ధనుర్వాతం రావచ్చు. ధనుర్వాతం అనేది ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రసవ సమయంలో మహిళలకి మరియు వారి శిశువుకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరైన రీతిలో క్రిమిసంహారకం చేయని పరికరాన్ని గర్భసంచీలో ఉంచడం లేదా శిశువు బొడ్డుత్రాడు కత్తిరించడానికి ఉపయోగించడం వల్ల కూడా ధనుర్వాతం శరీరంలోకి ప్రవేశించవచ్చు.

ఈ పరిస్థితి నిరోధించడానికి, ధనుర్వాతం రాకుండా బాలికలు మరియు గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్లు వేయించుకోవాలి. గర్భవతిగా ఉన్న మహిళ అప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోకపోతే, గర్భస్త సమయంలో మొదటి చెక్అప్ సమయంలో మొదటి ఇంజెక్షన్ తీసుకోవాలి. అటుపై, కనీసం ఒక నెల తర్వాత రెండవ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆతర్వాత, వీలైన పక్షంలో, మిగిలిన షెడ్యూళ్లు కూడా ఆమె పూర్తి చేయాలి:

  • నం. 3: 2వ ఇంజెక్షన్ తీసుకున్న కనీసం 6 నెలల తర్వాత
  • నం. 4: 3వ ఇంజెక్షన్ తీసుకున్న కనీసం 1 సంవత్సరం తర్వాత
  • నం. 5: 4వ ఇంజెక్షన్ తీసుకున్న కనీసం 1 సంవత్సరం తర్వాత
  • అటుమీదట ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాలి.
Sources
  • Audiopedia ID: tel010210