ధూమపానం వల్ల నా ఆరోగ్యం ఏవిధంగా శాశ్వతంగా దెబ్బతింటుంది
ధూమపానం చేసే వ్యక్తులు పొగాకులోని నికోటిన్ అనే మాదకద్రవ్యానికి బానిసలవుతారు. సిగరెట్ తాగకపోతే, వాళ్లు అనారోగ్యం లేదా భయంతో బాధపడవచ్చు. ధూమపానం మానేయడం చాలా కష్టం, ఎందుకంటే నికోటిన్ అనేది అత్యంత వ్యసనంగా మారే ఒక మాదకద్రవ్యం.
మహిళల కంటే ఎక్కువగా పురుషులే ధూమపానం చేస్తుంటారు కాబట్టి, ధూమపానం అనేది ప్రధానంగా పురుషుల ఆరోగ్య సమస్యగానే పరిగణిస్తుంటారు. అయితే, మహిళల్లోనూ ధూమపానం సంబంధిత అనారోగ్యాలు పెరుగుతున్నాయి. పేద దేశాల్లోనూ ఆరోగ్య సమస్యలు పెరగడానికి ఇదొక కారణంగా ఉంటోంది. ఒత్తిడి ఎదుర్కొవడంలో సహాయపడుతోందనే పేరుతో ప్రజలు ధూమపానం చేస్తుండడమే దీనికి ప్రధాన కారణం. అలాగే, ధనిక దేశాల్లోని ప్రజలు చాలామంది ధూమపానం ఆపేసిన నేపథ్యంలో, పేద దేశాల్లో సిగరెట్లు విక్రయించడానికి పొగాకు కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం కూడా మరొక కారణంగా ఉంటోంది.
ధూమపానం వల్ల చుట్టూ ఉండే వాళ్లకూ వ్యాధులు వస్తాయి. ధూమపానం చేయని తల్లిదండ్రుల పిల్లలతో పోలిస్తే, ధూమపానం చేసే తల్లిదండ్రుల పిల్లల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో పాటు ఊపిరితిత్తులు మరియు శ్వాస సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోనూ ధూమపానం వల్ల:
ఈ సమస్యల్లో కొన్ని మరణానికి దారితీస్తాయి. నిజానికి, ధూమపానం చేసే ప్రతి 4 మందిలో ఒకరు ధూమపాన సంబంధిత ఆరోగ్య సమస్యతోనే మరణిస్తున్నారు.