నష్టం మరియు మరణం అనేవి నా మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా దెబ్బతీస్తాయి
From Audiopedia
ఒక స్త్రీ తాను ప్రేమించే వ్యక్తిని, తన పనిని, తన కుటుంబాన్ని లేదా సన్నిహిత ఫ్రెండ్‌ని కోల్పోయినప్పుడు ఆమె దుఃఖంలో మునిగిపోవచ్చు. ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు లేదా వైకల్యానికి గురైనప్పుడు కూడా ఇలా జరగవచ్చు.
దుఃఖించడం అనేది ఒక వ్యక్తి తనకు జరిగిన నష్టం మరియు మరణం నుండి జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడంలో సహాయపడే ఒక సహజ ప్రతిస్పందన. అయితే, ఒక మహిళకి ఒకేసారి అనేక నష్టాలు ఎదురైనప్పుడు లేదా ఆమెకు ఇప్పటికే రోజువారీ ఒత్తిడి తీవ్రంగా ఉంటే, ఆమెలో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రం కావడం ప్రారంభించవచ్చు. ఒక మహిళ సాంప్రదాయ మార్గాల్లో దుఃఖించలేని సందర్భాల్లో-ఉదాహరణకు, ఆమె తన సంప్రదాయాలు పాటించలేని కొత్త సమాజానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు- కూడా ఇలా జరగవచ్చు.