నాకు తగినన్ని పాలు పడుతున్నాయని మరియు నా పాలు సరైన స్థితిలో ఉందని నేనెలా నిర్ధారించగలను
చాలామంది మహిళలు తమకు తగినంత పాలు లేవని అనుకుంటారు. దాదాపుగా ఎప్పుడూ ఇది నిజం కాదు. సరిగ్గా తిండి తినని తల్లుల్లో కూడా సాధారణంగా వారి బిడ్డకి సరిపోగల పాలు తయారవుతుంటుంది.
\\ మీ రొమ్ముల్లో ఎంత పాలు తయారవుతున్నాయి (మీలో ఎంత పాలు తయారవుతోంది) అనేది మీ శిశువు మీ రొమ్మల్ని ఎంతగా చప్పరిస్తోందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. శిశువు ఎంత ఎక్కువగా పాల కోసం చప్పరిస్తే, మీలో అంత ఎక్కువగా పాలు తయారవుతుంది. మీరు మీ బిడ్డకి మీ పాలు ఆపేసి, బదులుగా సీసా పాలు అలవాటు చేస్తే, మీ శరీరంలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
కొన్నిరోజుల పాటు శిశువు ఎల్లప్పుడూ తల్లిపాలు కోరుకుంటున్నట్టు అనిపించవచ్చు. మీ బిడ్డకి ఆకలి వేసినప్పుడల్లా మీరు మీ బిడ్డకి తల్లిపాలు పడితే, మీలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు, కొన్నిరోజుల్లోనే శిశువు మళ్లీ సంతృప్తిగా కనిపించవచ్చు. రాత్రిపూట తల్లిపాలు పట్టడం వల్ల తల్లిలో పాల ఉత్పత్తి పెరగడంలో సహాయపడుతుంది. మీలో తగినన్ని పాలు ఉత్పత్తి కావడం లేదని ఎవరు చెప్పినా, చివరకు ఆరోగ్య కార్యకర్త చెప్పినా సరే, వాళ్ల మాట నమ్మకండి.
పాలు ఉత్పత్తి కావడానికి రొమ్ములు నిండినట్లుగా అనిపించాల్సిన అవసరం లేదు. మహిళ ఎంత ఎక్కువ మంది శిశువులకు తల్లిపాలు ఇస్తుందో, ఆమె రొమ్ములు అంత ఎక్కువ తేలికగా అనిపిస్తాయి. పెద్ద రొమ్ముల్లో తయారయ్యే అదే స్థాయిలో చిన్న రొమ్ముల్లోనూ పాలు ఉత్పత్తి కాగలవు.
శిశువు తగినంత పాలు తాగుతోందని సూచించే అంశాలు:
ఎందుకంటే, ఇతర పాలు కంటే తల్లిపాలు భిన్నంగా కనిపిస్తుంది కాబట్టి, కొంతమంది మహిళలు అది మంచి పాలు కాదని భయపడుతుంటారు. కానీ, పిల్లలకు అవసరమైన ప్రతిఒక్కటీ తల్లిపాలు అందిస్తుంది.