నాకు తెలిసిన ఎవరైనా అత్యాచారానికి గురైతే నేనేం చేయగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

అది ఆమె తప్పు కాదని ఆమెకు భరోసా ఇవ్వండి.

ఆమెకి మద్దతుగా ఉండండి. ఆమె భావాలు వినండి, ఆమెకు ఏం అవసరమో నిర్ణయించుకోవడంలో ఆమెకు సహాయపడండి మరియు ఆమె తన జీవితం కొనసాగించగలదని ఆమెకు భరోసా ఇవ్వండి. గోప్యత మరియు భద్రత విషయంలో ఆమె అభ్యర్థనను గౌరవించండి. ఆమె సరే అంటే తప్ప మరెవరికీ ఆ విషయం చెప్పకండి.

ఆరోగ్య కార్యకర్త వద్దకు, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, ఆమె సమస్య వినడానికి మరియు మద్దతు అందించడానికి శిక్షణ పొందిన వారితో మాట్లాడటానికి, న్యాయవాదిని కలవడానికి మరియు ఆమె కోర్టుకి వెళ్లాలనుకుంటే ఆమెకి తోడుగా వెళ్లండి. మీకు ఆ రేపిస్ట్ తెలిసిన వ్యక్తి అయితే, అతడిని రక్షించే ప్రయత్నం చేయకండి. సమాజంలోని ప్రతి మహిళకీ అతను ప్రమాదకారి అని మర్చిపోకండి.

Sources
  • Audiopedia ID: tel020313