ఆత్మహత్య వ్యాఖ్యలను ఎల్లప్పుడూ చాలా తీవ్రంగా పరిగణించండి. ఒక వ్యక్తి అతను లేదా ఆమె ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్టు చెబితే, వాళ్లు ఆత్మహత్యకు తెగించవచ్చనే సంకేతాల పట్ల జాగ్రత్త వహించండి. తక్షణం నిపుణుల సహాయం పొందండి.
అతను లేదా ఆమె తన ఆత్మహత్య ఆలోచనలను రహస్యంగా ఉంచాలని మీతో చెబితే, మీరు అంగీకరించకండి. ఒకరి మరణానికి కారణమయ్యే రహస్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దాచకూడదు. మీరు దానిని రహస్యంగా ఉంచితే, వాళ్లు చనిపోవడానికి అనుమతించిన వారుగా బాధ్యత వహిస్తారు. అది మిమ్మల్ని మీ జీవితాంతం వెంటాడే విషయంగా ఉంటుంది. కాబట్టి, వారి ఆత్మహత్య నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోండి.
వాళ్ల మాటలు విని ఆశ్చర్యపోకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తి అప్పటికే చాలా బాధలో ఉన్నాడు కాబట్టి, వారి మాటలు విని మీరు ఆశ్చర్యపోతున్నట్టు వాళ్లు గ్రహిస్తే, వాళ్లు మరింత ఒత్తిడికి గురై, మరింత కుంగిపోతారు. కాబట్టి, ప్రశాంతంగా ఉండండి.
ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాటలు శ్రద్ధగా వినండి. ఆ వ్యక్తి తను మాట్లాడాలనుకున్నంత వరకు మాట్లాడనివ్వండి. శ్రద్ధగా వినండి. తద్వారా, మీరు వారికి వీలైనంత సహాయకరంగా ఉండగలరు మరియు వారి ఆత్మహత్య ఆలోచనలకు కారణమేమిటో వీలైనంత వరకు తెలుసుకోండి.
ప్రోత్సాహించే మాటలతో వారిని ఓదార్చండి. మద్దతు మాటలు ఉపయోగించేటప్పుడు ఇంగితజ్ఞానం ఉపయోగించండి. వీలైనంత సున్నితంగా మరియు శ్రద్ధగా వ్యవహరించండి.
మీరు వారి విషయంలో అత్యంత ఆందోళన చెందుతున్నారని వారికి తెలియజేయండి. మీ ఆందోళన గురించి వాళ్లకు చెప్పండి. మీ ఆందోళన వాళ్లకి తెలిసేలా చేయండి.
తీర్పు చెప్పకండి. ఆ వ్యక్తి మాటలు లేదా భావాలను నిందించకండి. మద్దతుగా మరియు శ్రద్ధగా వ్యవహరించండి. తీర్పు చెప్పకండి. తక్షణ సహాయం అందించండి. సహాయం అనేది కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల రూపంలో ఉండవచ్చు. ఆ వ్యక్తి ఆత్మహత్య ఆలోచనకు వాళ్లు కారణం కానంత వరకు వాళ్ల సహాయం తీసుకోండి లేదంటే, ఆరోగ్య కార్యకర్త లేదా థెరపిస్ట్ సహాయం అందించండి.
ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడే అవకాశం తీవ్రంగా ఉంటే, అతడు లేదా ఆమెను ఒంటరిగా వదిలివేయకండి. కాసేపైనా వదిలివేయకండి.
ఆ వ్యక్తికి సహాయం లభించి, ఆత్మహత్య ఆలోచన నుండి కొంచెం దూరమైన తర్వాత, అతను లేదా ఆమె కోసం ఆరోగ్య కార్యకర్త మరియు/లేదా థెరపిస్ట్ వద్ద అపాయింట్మెంట్ తీసుకోవడంలో సహాయం చేయండి. ఆత్మహత్య ఆలోచనలను నిపుణుల స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. శిక్షణ పొందిన వాళ్లు మాత్రమే అలాంటి సంరక్షణ అందించాలి.