నాకు HIV ఉంటే నేను నా ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవచ్చు
మీకు HIV పాజిటివ్ అని తేలిన వెంటనే, HIV సంరక్షణ మరియు చికిత్సా కార్యక్రమం కోసం చూడండి. ఇప్పటివరకు HIVకి చికిత్స లేనప్పటికీ, సంబంధిత ఔషధాలు తీసుకోవడం ద్వారా, HIV ఉన్న వ్యక్తులు సైతం ఎక్కువ కాలం జీవించడానికి మరియు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది.
వైద్యపరమైన సమస్యలను ప్రారంభంలోనే చూసుకోండి. క్రమం తప్పకుండా ఆరోగ్య కార్యకర్తను కలవండి. మీరు జబ్బుపడినప్పుడు, మీకు అవసరమైన చికిత్స అందేలా చూసుకోండి. ప్రతి ఇన్ఫెక్షన్ మీ రోగనిరోధక వ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది.
మీ శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి పోషకాహారం తినండి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీకు మంచివిగా ఉండే ఆహారాలే మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మీకు మంచివి కాగలవు. విటమిన్ ఇంజెక్షన్ల కోసం డబ్బు ఖర్చు చేయడానికి బదులు పోషకాహారం కోసం వెచ్చించండి.
పొగాకు, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.
మీ మరియు మీ భాగస్వామి ఆరోగ్యం కోసం సురక్షిత లైంగిక చర్యలు పాటించండి.
తగినంత విశ్రాంతి మరియు వ్యాయామం కోసం ప్రయత్నించండి. ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మీ శరీరానికి అవసరమైన బలాన్ని ఇవి అందిస్తాయి.
తరచుగా కడుక్కోవడం ద్వారా, త్రాగడానికి మరియు ఆహారం సిద్ధం చేయడానికి స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం ద్వారా సంక్రమణను నివారించండి.