నాకు HIV ఉన్నప్పటికీ నేను నా జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఏ వైద్య విధానంలోనూ - అది ఆధునిక వైద్యం కావచ్చు, సంప్రదాయ వైద్య విధానం కావచ్చు - HIVకి చికిత్స లేదు. అయినప్పటికీ, ప్రత్యేకించి, సరైన సంరక్షణ మరియు చికిత్సతో HIV సోకిన చాలామంది చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ సమయంలో క్రింది అంశాలు వారికి సహాయపడగలవు:

మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోండి.

స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి.

మీ రోజువారీ పనిని చేయడం ద్వారా చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి.

మీకు ఇష్టమైతే, లైంగిక ప్రక్రియలో పాల్గొనండి.

సురక్షితమైన లైంగిక స్పర్శను ఆస్వాదించడం ద్వారా మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.

మీరు సంభోగంలో పాల్గొన్నప్పుడు రక్షణ (కండోమ్) ఉపయోగించండి. ఇది మిమ్మల్ని, మీ భాగస్వామిని రక్షిస్తుంది.

HIV మరియు AIDS ఉన్న వ్యక్తుల సమూహంలో చేరడానికి లేదా అలాంటి ఒక సమూహం ప్రారంభించడానికి ప్రయత్నించండి. HIV మరియు AIDS ఉన్న కొందరు వ్యక్తులు సమాజానికి అవగాహన కల్పించడానికి, AIDSతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దే సంరక్షణ అందించడానికి మరియు HIV మరియు AIDS ఉన్న వ్యక్తుల హక్కులకు మద్దతు ఇవ్వడానికి కలిసి పనిచేస్తుంటారు.

మీ ఆధ్యాత్మిక మరియు మానసిక ఆరోగ్యం చక్కగా ఉంచుకోండి. మీ విశ్వాసం మరియు సంప్రదాయాలు మీలో ఆశ మరియు బలం రేకెత్తించగలవు.

భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీకు పిల్లలు ఉంటే:

  • ప్రస్తుత సమయాన్ని వారితో గడపండి, వారికి శ్రద్ధ మరియు మార్గదర్శకత్వం అందించండి.
  • మీరు ఇకపై అలా చేయలేని పక్షంలో, కుటుంబ సభ్యులు వారిని చూసుకునేలా ఏర్పాట్లు చేయండి.
  • వీలునామా రాండి. మీకు డబ్బు, ఇల్లు లేదా ఆస్తి ఉంటే, అవి మీరు కోరుకున్న వారికి దక్కేలా నిర్ధారించుకోండి. చట్టబద్ధంగా వివాహం కాని మహిళలు కొన్నిసార్లు వారి ఆస్తులను వారి పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు ఇవ్వలేరు. కాబట్టి, మీ ఆస్తులన్నీ వారికే దక్కడం కోసం చట్టబద్ధంగా వివాహం చేసుకోవడం మీకు సహాయపడవచ్చు.

మీ భాగస్వామికి HIV సోకితే మీరు సురక్షిత లైంగిక ప్రక్రియను అనుసరించగలిగితే, వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా అతని లేదా ఆమె భాగస్వామికి HIV సంక్రమణను నివారించవచ్చు. HIVని నివారించడానికి కండోమ్‌లు ఉత్తమ మార్గంగా ఉంటాయి. చర్మం మీది బహిర్గత గాయాలను కప్పి ఉంచండి మరియు STIలకు వెంటనే చికిత్స పొందండి. గుర్తుంచుకోండి - సంభోగం ద్వారానే కాకుండా, ఇతర మార్గాల్లోనూ సంతృప్తి పొందవచ్చు.

Sources
  • Audiopedia ID: tel011009