నాలో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయని నాకు అనిపిస్తే నేను మద్దతు కోసం ఎందుకు వెతకాలి

From Audiopedia
Jump to: navigation, search

బలమైన సామాజిక మద్దతు మరియు బలమైన వ్యక్తిగత సంబంధాలనేవి మన మానసిక ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన రక్షణ కారకాలుగా ఉంటాయి. ఆత్మహత్య ఆలోచనతో ఉండేవారు తరచుగా ఒంటరిగా భావిస్తారు. మీకు భాగస్వామి, కుటుంబం మరియు చాలా మంది స్నేహితులు ఉన్నప్పటికీ, మీరు ఒంటరితనం అనుభవిస్తారు. మన చుట్టూ మనుష్యులు ఉన్నంతమాత్రాన మనం వారితో అన్యోన్యంగా ఉన్నామని అర్థం కాదు. మీకు ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే, ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరని లేదా మీకు సహాయం చేయలేరని మీకు అనిపించవచ్చు. కానీ, మీ భావన పూర్తిగా తప్పు.

ఇతర మహిళలతో కలసి పనిచేయడం మీకు మరింత శక్తిని ఇస్తుంది. మీ రోజువారీ సమస్యలను మెరుగ్గా ఎదుర్కోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. అదొక చిన్న ప్రపంచంలా అనిపిస్తుంది. కలిసి మాట్లాడడం ద్వారా, తమలో చాలామంది ఒకే రకమైన సమస్యలతో బాధపడుతున్నారని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. ఇది మీ భారం తగ్గించడానికి సహాయపడుతుంది మరియు సమస్య మూల కారణాలు గుర్తించడానికి కూడా సహాయపడుతుంది.

అంతేకాకుండా, ఒక సమూహంలో లేదా ఇతర మహిళలతో చర్చించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం సులభంగా అనిపిస్తుంది. మీరు ఇదివరకు ఆలోచించని విధంగా మీ పరిస్థితిని ఎలా మార్చుకోవచ్చో ఇతర మహిళలు మీకు చెప్పవచ్చు లేదా మీరు వాళ్లకి చెప్పవచ్చు.

కొన్నిసార్లు మహిళలు తమ భావాలు దాచిపెడుతుంటారు (లేదంటే, తమలో అలాంటి భావనలు ఉన్నట్టు కూడా గ్రహించరు). కొన్ని భావాలు చెడ్డవి, ప్రమాదకరమైనవి లేదా సిగ్గుపడాల్సినవి అని వాళ్లు భావించడం లేదా వాళ్లకి అలా చెప్పి ఉండడం బహుశా అందుకు కారణం కావచ్చు. ఈ భావాల గురించి ఇతరులు మాట్లాడటం వినడం వల్ల ఒక మహిళ తనలోని అలాంటి భావాలను గుర్తించడంలో సహాయపడుతుంది. మీ సమస్య గురించి ఆలోచించడంలో ఇతర మహిళల మీకు సహాయపడగలరు. తద్వారా, మీరు ఆలోచించకుండానే మీ మొదటి ప్రేరణకు స్పందించే పరిస్థితి ఉండదు. దీనినే భావోద్వేగ మద్దతు అని పిలుస్తారు. మీలో ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు ఇది మీకు చాలా ముఖ్యం.

Sources
  • Audiopedia ID: tel020913