నాలో ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు నేను నా ఉద్వేగానికి ప్రతిస్పందించకూడదు

From Audiopedia
Jump to: navigation, search

ఆత్మహత్యలు మరియు ఆత్మహత్య ప్రయత్నాల్లో చాలావరకు ఉద్వేగ కారణంగా జరుగుతుంటాయి. మరో మాటలో చెప్పాలంటే, ఇదే వ్యక్తులు కొన్ని రోజుల ముందు లేదా కొన్ని రోజుల తరువాత లేదా వాళ్లు తమ చర్యల గురించి ఆలోచించి ఉంటే, వాళ్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసేవాళ్లు కాదు. కాబట్టి, ఉద్వేగం కలిగినప్పుడు దాని గురించి ఆలోచించండి. రాబోయే 24 గంటల్లో లేదా వచ్చే వారంలో మీ పరిస్థితి మెరుగ్గా మారితే అప్పుడేం చేస్తారో ఆలోచించండి? అప్పటి ఆనందాన్ని ఆస్వాదించడానికి మీరు ప్రాణాలతో ఉండరని మీరు చింతిస్తున్నారా?

మీ ఉద్వేగాన్ని కాస్త దూరం పెట్టండి. \"నేను ఏదైనా చేసే ముందు మరో 24 గంటలు (లేదా ఒక వారం) వేచి ఉంటాను\" అని మీకు మీరే చెప్పుకోండి. మీ ఆత్మహత్య ఆలోచనకు, దాన్ని నిజం చేసే చర్యకు మధ్య కనీసం 24 గంటల దూరం ఉండేలా చూడండి.

ఆత్మహత్య చేసుకోవడానికి మార్గాలు మీ ఇంట్లో ఇప్పటికే ఉంటే (ఉదాహరణకు తుపాకీ లేదా విషం), వాటిని వదిలించుకోవడంలో మీకు సహాయం చేసే స్నేహితుడిని లేదా మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తిని ఎంచుకోండి. కనీసం మరో 24 గంటలు అవి మీకు అందుబాటులో ఉండకూడదు (లేదా కనీసం వాటిని చేరుకోవడం మీకు కష్టంగా ఉండాలి). మీరు మీ ఆయుధాన్ని మీ ఫ్రెండ్‌కి అప్పగించి, తదుపరి 24 గంటలు దానిని మీకు తిరిగి ఇవ్వొద్దని అతన్ని లేదా ఆమెను అడగవచ్చు. ఈ సమయంలో, మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేసి, మిమ్మల్ని ఆత్మహత్య దిశగా ప్రలోభపెట్టే ప్రమాదకర ప్రదేశాలు (లోతైన గుంతలు, ఎత్తైన భవనాలు లేదా వంతెనలు, రైల్వే మొదలైనవి) వద్దకు వెళ్లకండి.

మీకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నప్పుడు మద్యం తాగకండి లేదా మాదకద్రవ్యాలు తీసుకోకండి. అవి ఉపశమనానికి త్వరిత మార్గంగా మరియు కొంత నొప్పిని తగ్గించే మార్గాలుగా అనిపించినప్పటికీ, మద్యం మరియు మాదకద్రవ్యాలు రెండూ మీ ఉద్వేగం మీద మీ నియంత్రణను తగ్గిస్తాయి మరియు ఆలోచనారహితంగా వ్యవహరించే ప్రమాదానికి దారితీస్తాయి.

Sources
  • Audiopedia ID: tel020914