నా అత్తమామలతో ఎదురయ్యే ఇతర విభేదాలను నేనెలా ఎదుర్కోవచ్చు

From Audiopedia
Jump to: navigation, search

మీ అత్తమామలతో మీకు ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో మార్పు రావాలంటే, మీ భర్త మద్దతు సాధించడం చాలా ముఖ్యం. మీ అత్తమామలు మీ భర్త తల్లిదండ్రులుగా బహుశా అతని మీద పిచ్చి ప్రేమతో ఉంటారు. కాబట్టి, మీ కంటే కూడా, అతని మాటకు వాళ్లు చాలా సులభంగా అంగీకరిస్తారు.

కాబట్టి, మీ అత్తమామలతో సమస్యలు పరిష్కరించడానికి మీ భర్త మద్దతు మరియు సానుభూతి పొందడం ఎల్లప్పుడూ మంచి ప్రారంభం కాగలదు మరియు మీరు అలా చేయడంలో క్రింది వ్యూహాలు సహాయపడగలవు:

  • మీ భర్త నుండి సహాయం కోరే సమయంలో ప్రశాంతంగా ఉండండి. అరుస్తూ లేదా ఏడుస్తూ మాట్లాడకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి అతడికి వివరించండి మరియు మిమ్మల్ని ఏది ఇబ్బంది పెడుతోందో అతను అర్థం చేసుకున్నాడని నిర్ధారించుకోండి. మొదట్లో, అతనికి సమస్యలు అర్థం కాకపోతే, అతనికి అర్థమయ్యే వరకు మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. మీకు అతని మద్దతు అవసరం అని మీరు అతడిని ఒప్పించడం చాలా ముఖ్యం.
  • అతని మీద దాడి చేయడానికి, నిందించడానికి లేదా అతడిని కించపరచడానికి ప్రయత్నించకండి. మీరు అలా చేస్తే, అతను తనను తాను రక్షించుకోవడం ప్రారంభిస్తాడు (ఇది సాధారణ మానవ ప్రతిచర్య) మరియు అటుపై మీ వివరణలు వినడానికి అతను సిద్ధపడకపోవచ్చు. మంచిగా ఉండండి, కోపంగా ఉండకండి. అతడిని మీ సమస్యలో భాగంగా కాకుండా, మీ సమస్య పరిష్కారంలో అతడు భాగం అనే దృష్టితో చూసేందుకు ప్రయత్నించండి. మీ భర్తగా, అతను మీ సహజ మిత్రుడే తప్ప మీకు అతడు శత్రువు కాదు (కనీసం అలా ఉండే అవకాశం లేదు) కాబట్టి, అతని మీద ఒత్తిడి పెంచకండి. బదులుగా, మీరు అతని సహాయం కోరుతున్నారని అతనికి అర్థమైందని నిర్ధారించుకోండి.
  • చాలా జంటల విషయంలో తరచుగా ఎదురయ్యే సమస్య ఏమిటంటే, తన భర్త తల్లిదండ్రుల ఇంటి నుండి బయటకి వచ్చేసి, సొంత కుటుంబం ప్రారంభించాలని మహిళలు కోరుకుంటారు. ఈ పరిస్థితిని చాలామంది మగవాళ్లు అర్థం చేసుకోగలిగినప్పటికీ, అలా చేయడానికి ఇష్టపడరు. మీ సమస్య అదే అయితే, మీ భర్త తన తల్లిదండ్రుల పట్ల చూపించే విధేయతను అర్థం చేసుకోవడానికి, గౌరవించడానికి ప్రయత్నించండి, వాటి గురించి ప్రశ్నించకండి. బదులుగా, మీ ప్రస్తుత జీవన పరిస్థితి గురించి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నదేమిటో అతడికి వివరించే ప్రయత్నం చేయండి మరియు అతని తల్లిదండ్రుల పట్ల అతని విధేయతను సవాలు చేయకుండా (చాలా ఎక్కువగా), మిమ్మల్ని సంతృప్తి పరచగల మార్పుల కోసం కలిసి చూడండి. బయటకు వెళ్లిపోయే బదులు, మీ జీవన విధానంలో కొన్ని సర్దుబాట్లు చేయడానికి ప్రయత్నించండి. వీలుకాకపోతే, మీ భర్తగా, మీ పట్ల అతను కొంతైనా విధేయతతో ఉండాలని అతనికి గట్టిగా చెప్పండి. కానీ, సున్నితంగా ఆ పని చేయండి.
  • మీ ఆందోళనలు మరియు సమస్యల గురించి మీ భర్తతో మాట్లాడడం వల్ల మీరు మరింత సంఘర్షణ సృష్టించినవారవుతారని ఎప్పుడూ అనుకోకండి. భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకోకపోవడమే చాలా జంటల విషయంల అధ్వాన్న పరిస్థతికి దారితీస్తుంది. కాబట్టి, అలా జరిగినప్పుడు, నిస్సందేహంగా అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. కాబట్టి, ఏ బంధంలోనైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కొనసాగించడం చాలా ముఖ్యం. మీ భావాలను ఎల్లప్పుడూ మీలోనే ఉంచుకోవడం వల్ల మీలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత పెరుగుతుంది.
  • మీ భర్త మిమ్మల్ని లేదా మీ సమస్యలను అర్థం చేసుకోరని మరియు వారితో చర్చించడం అర్థరహితమని ఎప్పుడూ అనుకోకండి. మొదట్లో అతనికి అర్థం కాకపోతే, అతను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీరు మరింత కష్టపడాలి. పురుషులు మరియు మహిళలు అనేక అంశాలలో భిన్నంగా ఉంటారు, భిన్నంగా ఆలోచిస్తారు, భిన్నంగా అనుభూతి చెందుతారు మరియు ప్రవర్తిస్తారు. వాళ్లు వేర్వేరు జీవితాలు గడుపుతారు మరియు తరచుగా అనేక విషయాలపై వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి లేదా మీరు వివరించే ప్రయత్నం చేస్తున్న సమస్యలు అర్థం చేసుకోవడానికి మీ భర్తకు సమయం అవసరమైనప్పుడు అసహనం చెందకండి.

మీ జీవితంలో మంచి అంశంగా ఏదైతే ఉందో దానిని మరింత మెరుగుపరచడానికి మీరేం చేయగలరనే దానిమీద దృష్టి పెట్టేందుకు ప్రయత్నించండి. మీరు ఎల్లప్పుడూ సానుకూల మార్పులు చేయవచ్చు. మీరు ఎప్పటికీ నిస్సహాయులు కాదు.

Sources
  • Audiopedia ID: tel021016