నా చిన్నారికి అయోడిన్ ఎందుకు ముఖ్యమైనది
పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి స్వల్ప మొత్తంలో అయోడిన్ అవసరం. గర్భధారణ సమయంలో ఒక మహిళకు తగినంత అయోడిన్ లభించకపోతే, ఆమె శిశువు మానసిక వైకల్యం లేదా వినికిడి లేదా భాషణ వైకల్యంతో జన్మించే అవకాశం ఉంది. శిశువుగా ఉన్నప్పుడు మరియు బాల్యంలో తగినంత అయోడిన్ లభించకపోతే, అతను లేదా ఆమెలో శారీరక, మానసిక లేదా అభిజ్ఞాత అభివృద్ధి ఆలస్యం కావచ్చు. అయోడిన్ లోపం స్వల్పంగా ఉన్నప్పటికీ, పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు తెలివితేటలను తగ్గిస్తుంది.
థైరాయిడ్ గ్రంథి అసాధారణ పెరుగుదలకు కారణమయ్యే గాయిటర్ కారణంగా, మెడ వాపు వస్తుంది. ఆహారంలో అయోడిన్ లేకపోవడానికి ఇది సంకేతం. గర్భధారణ ప్రారంభంలో అయోడిన్ లోపం వల్ల గర్భస్రావం లేదా మృత శిశు జనన ప్రమాదం పెరుగుతుంది. సాధారణ ఉప్పుకు బదులుగా అయోడైజ్డ్ ఉప్పు ఉపయోగించడం వల్ల గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు అవసరమైనంత అధిక అయోడిన్ లభిస్తుంది. అయోడైజ్డ్ ఉప్పు మొత్తం కుటుంబానికి సురక్షితమైనది మరియు అన్ని వంటలకు అవసరమయ్యే ఏకైక ఉప్పు. మంచి నాణ్యత కలిగిన అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే కొనుగోలు చేసినట్టు కుటుంబాలు నిర్ధారించుకోవాలి. అది సరైన విధంగా మార్క్ చేయబడి మరియు ప్యాక్ చేయబడి ఉండాలి. తల్లులు గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే తినేలా చూసుకోవాలి. తల్లులు మరియు తండ్రులు తమ పిల్లలు తినే ఉప్పు అయోడైజ్డ్‌గా ఉండేలా జాగ్రత్త వహించాలి.