నా చిన్నారికి ఇనుము ఎందుకు ముఖ్యం
ఆహారంలో ఇనుము లేకపోవడమనేది రక్తహీనతకు ఒక సాధారణ కారణం. మలేరియా మరియు కొంకిపురుగులు వల్ల కూడా పిల్లలు రక్తహీనతకు గురవుతారు. ఇనుము లోపం శిశువులు మరియు చిన్న పిల్లలలో శారీరక మరియు మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఇనుము లోపం కొద్దిమేర ఉన్నప్పటికీ, పిల్లల్లో మేధో అభివృద్ధిని దెబ్బతీస్తుంది. రక్తహీనత అనేది ప్రపంచంలో అత్యంత సాధారణ పోషక రుగ్మతగా ఉంటోంది.
పిల్లలు వారి శారీరక మరియు మానసిక సామర్థ్యాలు కాపాడుకోవడానికి మరియు రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అవసరం. కాలేయం, లేత మాంసాలు మరియు చేపలు లాంటి మాంసాహారాలు ఇనుముకి ఉత్తమ వనరులుగా ఉంటాయి. పప్పుధాన్యాలు లాంటి కొన్ని శాఖాహార ఆహారాల్లోనూ ఇనుము ఉంటుంది. గోధుమ మరియు మొక్కజొన్న పిండి, ఉప్పు, చేపల సాస్ లేదా సోయా సాస్ లాంటి ఆహారాలను కొన్నిసార్లు ఇనుముతో కలిపి అందిస్తుంటారు. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు మరియు ఐరన్ సప్లిమెంట్లు రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. విటమిన్-సితో కలిపి ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల ఇనుమును జీర్ణ వ్యవస్థ బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.