నా జీవితంలో మరియు సమాజంలోని మార్పులు నా మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఆర్థిక వ్యవస్థలో మార్పుల కారణంగా లేదా రాజకీయ సంఘర్షణ కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని సమాజాల్లో వేగవంతమైన మార్పు అనివార్యమవుతోంది. ఈ మార్పుల్లో భాగంగా, కుటుంబాలు మరియు సమాజాలు దాదాపుగా వారి మొత్తం జీవన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటోంది. అలాంటి రెండు ఉదాహరణ కథలు ఇక్కడ రెండు ఉన్నాయి:

  • \"నా పేరు ఎధినా. యుద్ధం ప్రారంభమైనప్పుడు, సైనికులు వచ్చి మా గ్రామంలోని పురుషులను యుద్ధంలో చేరాల్సిందిగా బలవంతం చేశారు. కొందరు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. మేము పర్వతాల్లోకి పారిపోయాము. కానీ, ఆహారం దొరకడం కష్టమైంది. ఇప్పుడు మేము సరిహద్దుకు అవతలి వైపున ఉన్న శిబిరంలో శరణార్థులుగా జీవిస్తున్నాము. సాధారణంగా, మా దగ్గర తినడానికి తగినంత ఉంది. కానీ, చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. శిబిరం అపరిచితులతో నిండిపోయి ఉంది. నేను మళ్ళీ నా ఇంటిని చూస్తానా? అని ప్రతిరోజూ నేను ఆశ్చర్యపోతూనే ఉన్నాను.
  • \" నా పేరు జురేమా. మా పొలం నుండి ప్రతి సంవత్సరం తక్కువ ఉత్పత్తి మాత్రమే లభిస్తుంది. విత్తనాలు కొనడానికి మేము అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఎరువులు కొనడానికి కూడా ప్రయత్నించాము. కానీ, బ్యాంకు అప్పు తిరిగి చెల్లించే స్థాయికి ఎదగలేకపోయాము. చివరకు మేము మా భూమిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మేము నగరం చివర్లో ఒక గుడిసెలో నివసిస్తున్నాము. ప్రతి ఉదయం నేను మేల్కొన్నప్పుడు, ఉదయం ఎల్లప్పుడూ నన్ను పలకరించే పక్షుల గురించి గుర్తుకొస్తుంది. కానీ, ఇక్కడ పక్షులు లేవని కూడా వెంటనే గుర్తొస్తుంది. ఇతరుల ఇల్లు శుభ్రం చేసే పని మాత్రమే నాకు మిగిలింది.

కుటుంబాలు మరియు సమాజాలు విడిపోయినప్పుడు, లేదా వారి జీవితం అత్యంత మారిపోయినప్పుడు, పాత రకం ఓర్పు పద్ధతులు ఇకపై పనిచేయవు. దీంతో, ఆ ప్రజల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చు.

Sources
  • Audiopedia ID: tel011504