నా త్రాగునీటిని నేను ఏవిధంగా శుద్ధి చేయవచ్చు

From Audiopedia
Jump to: navigation, search

మీరు మీ నీటిని శుద్ధి చేయడానికి కొన్ని సరళమైన మరియు చవకైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

సూర్యకాంతి సూర్యకాంతి అనేక హానికర సూక్ష్మక్రిములను చంపుతుంది. సూర్యరశ్మి ఉపయోగించి నీటిని శుద్ధి చేయడం కోసం, శుభ్రంగా, స్పష్టంగా ఉండే గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో నీళ్లు నింపి, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆరుబయట ఉంచండి. రోజంతా ఎండ తగిలే బహిరంగ ప్రదేశంలో కంటైనర్లు ఉంచారని నిర్ధారించుకోండి. (మీకు తక్షణం త్రాగునీరు అవసరమైతే, శుద్ధీకరణ కోసం నీళ్ల కంటైనర్లను మిట్టమధ్యాహ్నం 2 గంటల పాటు ఎండలో ఉంచితే సరిపోతుంది.) నీటిలోకి సూక్ష్మక్రిములు చేరకుండా ఉండడం కోసం పిల్లలు, దుమ్ము మరియు జంతువుల నుండి దూరంగా ఉండే ప్రదేశంలో నీళ్లు నిల్వ చేయండి. ఉపయోగించే ముందు నీటిని చల్లబరచాలనుకుంటే, రాత్రివేళ కంటైనర్లను ఇంట్లోకి తీసుకు వెళ్లండి. ఒకే కంటైనర్లో ఒకటి లేదా రెండు రోజులు నీళ్లు నిల్వ చేయవచ్చు. వెచ్చటి వాతావరణాల్లో సూర్యరశ్మితో శుద్దీకరణ ఉత్తమంగా పనిచేస్తుంది.

నిమ్మరసం కొన్ని సందర్భాల్లో, నిమ్మరసంతో కలరా (మరియు కొన్ని ఇతర సూక్ష్మక్రిములు) నాశనమవుతాయి. ఒక లీటరు (1 క్వార్ట్) నీటిలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, ఆ నీటిని 30 నిమిషాలు అలాగే ఉంచండి.

వేడిచేయడం నీటిని 1 నిమిషం వేడి చేయడం ద్వారా, అందులోని సూక్ష్మక్రిములు నాశనమవుతాయి. 1 పూర్తి నిమిషం వేడి చేసిన తర్వాత, నీటిని చల్లారనివ్వండి. అయితే, నీటిని వేడిచేయడానికి చాలా ఇంధనం ఖర్చవుతుంది కాబట్టి, నీళ్లు శుద్ధి చేయడానికి వేరే మార్గం లేనప్పుడు మాత్రమే ఈ పద్ధతి ఉపయోగించండి.

Sources
  • Audiopedia ID: tel010116