తక్కువ నీళ్లు ఉండే ప్రదేశంలో, బాత్‌టబ్‌లో సైతం రెండే నిమిషాల్లో చిన్నపిల్లలు మునిగిపోయే ప్రమాదం ఉంది.
మునిగిపోవడం వల్ల మెదడుకు గాయం కావడం లేదా మరణం సంభవించవచ్చు. పిల్లలు మునిగిపోవడాన్ని నిరోధించడం కోసం వాళ్లు నీటికి దగ్గర్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరియు ఇతర సంరక్షకులు వారిని నిశితంగా పర్యవేక్షిస్తూ ఉండాలి.
పిల్లలు ఉండే ప్రదేశాల్లో నీళ్లు ఉంటే, ఈ జాగ్రత్తలు పాటించాలి:
పిల్లలు తెరవలేని విధంగా బావులు మరియు వాటర్ ట్యాంకులకు మూతలు బిగించండి
టబ్బులు మరియు బకెట్లు ఉపయోగించనప్పుడు వాటిని తలక్రిందులుగా పెట్టండి. పిల్లలు స్నానం చేసే సమయంలో వాళ్లని గమనిస్తూ ఉండండి
నీటి వనరుల సమీపంలో నివసించే కుటుంబాల్లో పిల్లలున్నప్పుడు ఆ ఇంటి చుట్టూ కంచె వేసి, గేటుకి తాళం వేయడం ద్వారా, చిన్న పిల్లలు నీటి వనరు దగ్గరికి వెళ్లకుండా నిరోధించండి
గుంటలు మరియు పూల్స్ లాంటి వాటి చుట్టూ నిలువు పట్టీలతో కంచె నిర్మించండి. పట్టీల మధ్య దూరం పిల్లలు దూరడానికి వీలు లేకుండా ఉండేలా చూసుకోండి
నీటి మధ్యలో నివసించే కుటుంబాల్లోని కిటికీలకు నిలువు పట్టీలు కట్టడం ద్వారా, పిల్లలు ఆ కిటికీల గుండా నీటిలో పడిపోవడాన్ని నిరోధించండి
పిల్లలకు చిన్నప్పుడే ఈత నేర్పించండి
ఈత తెలియని చిన్నపిల్లలు మరియు పెద్ద పిల్లలు నీటిలో ఆడుకుంటూ ఉంటే, వాళ్లకి తగిన ఫ్లోటేషన్ పరికరం (లైఫ్ జాకెట్) కట్టండి
ఈత కొట్టే పిల్లలను ఎల్లప్పుడూ పర్యవేక్షించండి
వేగంగా ఉండే ప్రవాహాల్లో మరియు వరదలు వచ్చే ప్రమాదం ఉన్న ప్రదేశాల్లో ఒంటరిగా ఈతకు వెళ్లొద్దని పిల్లలకు చెప్పండి
నీటి స్థాయి పెరుగుతుంటే, ఈత కొట్టే పిల్లల్ని జాగ్రత్తగా పర్యవేక్షించండి
చాలా త్వరగా ఇల్లు వదలి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఏ చోటుకి వెళ్లాలనే విషయాన్ని అర్థం చేసుకునే వయసున్న పిల్లలతో సహా, కుటుంబ సభ్యులందరికీ స్పష్టంగా చెప్పండి.