ప్రపంచంలోని అత్యంత పురాతన మరియు ఆరోగ్యకర పద్ధతుల్లో తల్లి పాలు ఇవ్వడం కూడా ఒకటి. అయితే, ప్రపంచం మారుతున్న కొద్దీ, తమ శిశువుకి తల్లిపాలు అందించే విషయంలో మహిళలకు సమాచారం మరియు మద్దతు అవసరం.
తల్లిపాలు ఇవ్వడం ఎందుకు ముఖ్యమంటే:
శిశువు ఆరోగ్యంగా మరియు బలంగా ఎదగడానికి తల్లి పాలు మాత్రమే సరైన ఆహారం.
తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రసవం తర్వాత, గర్భసంచీ నుండి రక్తస్రావం ఆగడంలో సహాయపడుతుంది.
తల్లి పాలతో శిశువుకి మధుమేహం, క్యాన్సర్, డయేరియా మరియు న్యుమోనియా లాంటి అనారోగ్యాలు మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. తల్లిలోని వ్యాధి నిరోధక శక్తి తల్లి పాలు ద్వారా శిశువుకి చేరుతుంది.
శిశువుకి పాలివ్వడం వల్ల తల్లికి క్యాన్సర్ మరియు ఎముకలు బలహీనంగా లేదా పెళుసుగా మారే వ్యాధి (ఆస్టియోపోరోసిస్) నుండి రక్షణ లభిస్తుంది.
తల్లిపాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, సంసిద్ధంగా మరియు సరైన ఉష్ణోగ్రతలో అందుబాటులో ఉంటుంది.
తల్లి పాలివ్వడం వల్ల తల్లికి మరియు శిశువుకి మధ్య సానిహిత్యం మరియు భద్రత అనే భావన ఏర్పడుతుంది.
కొందరు మహిళల విషయంలో, పాలివ్వడం వల్ల వాళ్లు త్వరగా గర్భం ధరించకుండా రక్షణ ఉంటుంది.