నా బిడ్డ ఊపిరాడని స్థితికి చేరుకోవడాన్ని నేనెలా నిరోధించాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

చిన్నపిల్లలు తమ పర్యావరణాన్ని అన్వేషించే క్రమంలో, ఏదైనా వస్తువును నోట్లో ఉంచుకున్నప్పుడు వాళ్లకి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, చాలా గట్టిగా ఉండే కొన్ని మిఠాయిలు చిన్నపిల్లలు మింగలేని పరిస్థితిల్లో అవి వారి గొంతులో అడ్డం పడి వాళ్లకి ఊపిరి ఆడని పరిస్థితి రావచ్చు.

తల్లిదండ్రులు లేదా ఇతర సంరక్షకులు ఇలా చేయాలి:

  • పిల్లలు ఆడుకునే మరియు నిద్రపోయే ప్రదేశాల్లో బటన్లు, పూసలు, బెలూన్లు, పెన్ క్యాప్‌లు, నాణేలు, విత్తనాలు మరియు గింజలు లాంటి చిన్న వస్తువులు లేకుండా శుభ్రంగా ఉంచండి
  • పిల్లలు ఆడుకోవడం కోసం కొత్త బొమ్మలు ఇచ్చే ముందు వాటిని జాగ్రత్తగా తనిఖీ చేయండి. పిల్లలు నోట్లో వేసుకుని మింగేయగల వరిమాణంలో వాటిలో విరిగిపోగల లేదా ఊడిపోగల భాగాలు లేవని నిర్ధారించుకోండి
  • చిన్న పిల్లలకు వేరుశెనగ గింజలు, గట్టిగా ఉండే మిఠాయిలు లేదా చిన్న ఎముకలు లేదా విత్తనాలతో ఉండే ఆహార పదార్థాలు ఎప్పుడూ ఇవ్వకండి.
  • చిన్నపిల్లలు ఏదైనా తింటున్నప్పుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండండి మరియు పిల్లలు సులభంగా నమలగల లేదా మింగగల స్థాయిలో ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయండి
  • దగ్గడం, గోల చేయడం మరియు అధిక వేగంతో, శబ్దం వచ్చేలా ఊపిరితీసుకోవడం లేదా అస్సలు శబ్ధమే చేయకుండా నిశ్చేష్టగా ఉండిపోతే, ఆ చిన్నారి ఊపిరి తీసుకోలేకపోతోందని మరియు ఏదో మింగేసిందని అర్థం. చిన్నారి ఏదైనా నోట్లో పెట్టుకున్నట్టు ఏ ఒక్కరూ చూడకపోయినప్పటికీ, ఉన్నట్టుండి శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే, ఆ చిన్నారి ఏదో మింగేసిందని తల్లితండ్రులు లేదా సంరక్షులు అనుమానించాలి.
Sources
  • Audiopedia ID: tel020615