నా మలిదశ సంవత్సరాల్లో నేను నా సంతోషకర లైంగిక సంబంధాలను ఎలా కొనసాగించాలి
కొంతమంది మహిళల విషయంలో రుతువిరతి అనేది వివాహ సంబంధిత డిమాండ్ల నుండి విముక్తి లాంటిది. ఇంకొందరిలో అవాంఛిత గర్భం గురించిన భయం పోతుంది కాబట్టి, లైంగిక చర్య మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే, రుతువిరతి తర్వాత కూడా మహిళలందరికీ ప్రేమ మరియు ఆప్యాయత అవసరం. వయస్సు మీద పడడం ఒక్కటే స్త్రీ తన జీవితాంతం లైంగిక ఆనందం పొందలేకపోవడానికి ఎంతమాత్రమూ కారణం కాలేదు.
మహిళకు వయసు మీద పడే కొద్దీ, ఆమె శరీరంలో చోటుచేసుకునే కొన్ని మార్పులు ఆమె లైంగిక సంబంధాలను ప్రభావితం చేయవచ్చు:
ఈ సమస్యలను నివారించడానికి మీరు ఏం చేయవచ్చు:
లైంగిక చర్యకి ముందు ఎక్కువ సమయం తీసుకోవడానికి ప్రయత్నించండి తద్వారా, మీ యోని దాని సహజ తేమను సాధించగలదు. సెక్స్ సమయంలో ఉమ్మి (లాలాజలం), కూరగాయలతో తయారు చేసిన నూనెలు (మొక్కజొన్న నూనె, ఆలివ్ నూనె) లేదా కె-వై జెల్లీ లాంటి ఇతర లూబ్రికెంట్లు కూడా మీరు ఉపయోగించవచ్చు. యోనిలో తేమ పెంచడానికి పెట్రోలియం జెల్ లేదా సువాసన నూనెలు ఉపయోగించవద్దు. ఇవి చికాకు కలిగించవచ్చు.
గుర్తుంచుకోండి: మీరు కండోమ్ ఉపయోగిస్తున్నట్లయితే, తడి కోసం నూనెలు ఉపయోగించకండి. నూనె వల్ల కండోమ్ బలహీనపడవచ్చు మరియు అది చిరిగిపోవచ్చు.
మీ భాగస్వామికి అంగం గట్టిపడడం (అంగస్తంభన) ఆలస్యమవుతుంటే, ఓపికగా ఉండండి. అతన్ని తాకడం సహాయపడగలదు.
లైంగిక చర్యకి ముందు యోని పొడిబారే పనులు చేయకండి. మూత్ర సమస్యలు నిరోధించడం కోసం, సూక్ష్మక్రిములను బయటకు పంపడం కోసం లైంగిక చర్య తర్వాత, వీలైనంత త్వరగా మూత్ర విసర్జన చేయండి.