నా మలి వయసు సంవత్సరాల్లో నేను ఆరోగ్యంగా ఉండటానికి నేను ఏవిధమైన ఆహారం తీసుకోవాలి
ఒక మహిళ వయస్సు పెరిగే కొద్దీ ఆమె శరీరం బలం కోల్పోకుండా ఉంచడానికి మరియు వ్యాధులతో పోరాడటానికి ఆమెకి పోషక ఆహారం అవసరం. కొన్ని రకాల ప్రత్యేక ఆహారాలు కూడా అవసరం కాగలవు. ఆమె శరీరం తక్కువ ఈస్ట్రోజెన్ తయారవుతుంది కాబట్టి, సోయా బీన్స్, టోఫు (సోయా పన్నీర్), కాయధాన్యాలు మరియు ఇతర బీన్స్ లాంటి శాఖాహార ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది కాబట్టి, కాల్షియం అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎముకలు బలంగా ఉండాలంటే, కాల్షియం అవసరం.
కొన్నిసార్లు వృద్ధులకు వాళ్లకి అవసరమైన దానికంటే తక్కువ తిన్నప్పటికీ, కడుపు నిండిన భావన వచ్చేస్తుంది. రుచి మరియు వాసనలో మార్పుల వల్ల ఈ పరిస్థితి రావచ్చు. దీంతో, తిండి మీద పెద్దగా ఇష్టం ఉండదు. వృద్ధాప్యం వల్ల శరీరంలో వచ్చే మార్పుల వల్ల తినడం ప్రారంభించిన తర్వాత, తొందరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంటే, వృద్ధులకు తక్కువ పోషకాహారం సరిపోతుందని దీని అర్థం కాదు. వాళ్లు బాగా తినడం కొనసాగించడానికి, వివిధ రకాల ఆహారాలు తినేలా వారికి ప్రోత్సాహం అవసరం.