నా విషయంలో STIలు తీవ్ర సమస్యగా ఉండడానికి కారణమేమిటి
పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ STIలు రావచ్చు. అయితే, ఒక మహిళ నుండి ఒక పురుషుడికి సంక్రమించే సంభావ్యతతో పోలిస్తే, ఒక పురుషుడి నుండి ఒక మహిళకు ఇవి సులభంగా సంక్రమించగలవు. ఎందుకంటే, లైంగిక ప్రక్రియ సమయంలో, పురుషుడు పురుషాంగం అనేది స్త్రీ శరీరంలోని ఏదో ఒక భాగంలోకి-ఆమె యోని, నోరు లేదా పాయువు-లోకి చొప్పించడం జరుగుతుంది. కండోమ్ లేకుండా లైంగిక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ఇన్ఫెక్షన్‌తో ఉండే పురుషుడి వీర్యం ఆ మహిళ శరీరం లోపలకి చేరుతుంది. తద్వారా, ఆమె గర్భాశయంలో, గొట్టాల్లో మరియు అండాశయాల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా మహిళ యోని మీద పుండ్లు లేదా యోని లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆమెకు HIV మరింత సులభంగా సోకగలదు.
ఎందుకంటే, మహిళల్లో STIలు శరీరం లోపల ఉండడం వల్ల, పురుషుడితో పోల్చినప్పుడు మహిళల్లో STIల సంకేతాలు ప్రత్యక్షంగా చూడడం కష్టంగా ఉంటుంది. కాబట్టి, ఒక మహిళ జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెప్పడంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ ఏరకమైనదో చెప్పడం కూడా కష్టమే.
ఒక మహిళ తనను తాను STIల నుండి రక్షించుకోవడం కష్టం. ఎందుకంటే, భాగస్వామి లైంగిక కోరిక వ్యక్తపరిచినప్పుడు ఆమె తరచుగా అంగీకరించాల్సి ఉంటుంది. తన భాగస్వామికి ఇతరులతో లైంగిక సంబంధాలు ఉన్నప్పుడు దానివల్ల అతనికి STIలు సోకినప్పటికీ ఆ విషయం ఆమెకి తెలియకపోవచ్చు. వ్యాధి సోకిన వేరొక భాగస్వామితో అతనికి సంబంధం ఉంటే, అతని భార్యకి కూడా అది సోకవచ్చు.
కండోమ్ ఉపయోగించాల్సిందే అని ఒక మహిళ తన భాగస్వామిని ఒప్పించే పరిస్థితి లేకపోవచ్చు. భాగస్వాములిద్దరూ రక్షణగా ఉండడానికి లేటెక్స్ కండోమ్‌లు ఉత్తమంగా ఉంటాయి. కానీ, వాటిని ఉపయోగించడానికి పురుషుడు సిద్ధంగా ఉండాలి.