నా శరీరానికి తగినంత ఇనుము లభిస్తోందని నేనెలా నిర్ధారించుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

రక్తం ఆరోగ్యంగా ఉండటానికి మరియు బలహీన రక్తం (రక్తహీనత) నివారించడంలో సహాయపడటానికి శరీరానికి ఇనుము అవసరం. ఒక మహిళకు ఆమె జీవితాంతం, ప్రత్యేకించి, నెలసరి రక్తస్రావం జరుగుతున్న సంవత్సరాల్లో మరియు గర్భధారణ సమయంలో చాలా ఇనుము కావాలి.

క్రింది ఆహారాల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది:

  • మాంసం (ముఖ్యంగా కాలేయం, గుండె మరియు మూత్రపిండాల్లో)
  • రక్తం
  • చికెన్
  • గుడ్లు
  • చేపలు
  • బీన్స్
  • మిడుతలు, పురుగులు, చెదపురుగులు
  • బఠానీలు

క్రింది ఆహారాల్లో కొంతవరకు ఇనుము కూడా ఉంటుంది:

  • ముదురు రంగు ఆకులతో ఉండే క్యాబేజీ
  • బంగాళాదుంపలు
  • కాలీఫ్లవర్
  • కాయధాన్యాలు
  • బ్రస్సెల్ మొలకలు
  • టర్నిప్‌లు
  • పొద్దుతిరుగుడు, నువ్వులు, గుమ్మడి విత్తనాలు
  • స్ట్రాబెరీలు
  • ముదురు పచ్చరంగు ఆకులతో ఉండే కూరగాయలు
  • పైనాపిళ్లు
  • యామ్‌లు
  • సముద్రపు పాచి
  • బ్రకోలి
  • ఎండు ఫలాలు (ప్రత్యేకించి, ఖర్జూరాలు, ఆప్రికాట్‌లు మరియు రైజిన్లు)
  • బ్లాక్-స్ట్రాప్ మొలాసిస్‌లు

క్రింది విధంగా చేయడం ద్వారా, మీరు మరింత ఎక్కువ ఇనుము పొందవచ్చు:

  • ఇనుముతో చేసిన పాత్రల్లో వంట చేయండి. వంట చేసేటప్పుడు ఆహారానికి టమోటాలు, గజనిమ్మ లేదా నిమ్మరసం (విటమిన్ సి అధికంగా ఉండేవి) జోడిస్తే, ఇనుప పాత్రల నుండి మరింత ఎక్కువ ఇనుము ఆహారంలోకి చేరుతుంది.
  • పరిశుభ్రంగా ఉండే ఇనుప ముక్క-ఇనుప మేకు లేదా గుర్రపునాడా-ఆహారంలో వేయండి. ఇవి స్వచ్ఛమైన ఇనుముతో చేసినవై ఉండాలి. మిశ్రమ లోహాలతో చేసినవి కాకూడదు.
  • ఇనుప మేకు లాంటి ఒక పరిశుభ్రమైన ఇనుప ముక్కను కొంచెం నిమ్మరసంలో కొన్ని గంటలు ఉంచండి. తర్వాత, ఆ నిమ్మరసంతో జ్యూస్ తయారు చేసుకుని తాగండి.

ఇనుము కలిగిన ఆహారాలను నిమ్మజాతి పండ్లు లేదా టమోటాలతో కలిపి తినడం ఉత్తమం. ఈ పండ్లలో విటమిన్-సి ఉండడం వల్ల మీ శరీరం ఇనుముని మరింత సమర్థంగా స్వీకరిస్తుంది.

Sources
  • Audiopedia ID: tel010405