నిప్పు లేదా మంటల కారణంగా నా పిల్లల చర్మం కాలకుండా నేనెలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఈ రకంగా చర్మం కాలడాన్ని నిరోధించడానికి:

  • వంటగదిలో మంటలు, అగ్గిపుల్లలు, పారాఫిన్ దీపాలు, కొవ్వొత్తులు మరియు పారాఫిన్ మరియు కిరోసిన్ లాంటి మంట అంటుకునే ద్రవాల నుండి చిన్నపిల్లలను దూరంగా ఉంచండి.
  • చిన్న పిల్లలకు అందకుండా ఉండడం కోసం ఎత్తుగా నిర్మించిన వేదిక మీద స్టౌ ఉంచండి.
  • కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, నేరుగా నేల మీద కాకుండా, కొంచెం ఎత్తుగా ఉండేలా ఆ పొయ్యిని నిర్మించండి. ఆ పొయ్యి నుండి పిల్లల్ని దూరంగా ఉంచడానికి బంకమట్టి, వెదురు లేదా ఇతర వస్తువులతో అడ్డుగోడ నిర్మించండి లేదా వంట ప్రదేశం నుండి చిన్నపిల్లల్ని దూరంగా ఉంచడం కోసం ప్లేపెన్ అడ్డంకి కూడా ఉపయోగించవచ్చు.
  • చిన్న పిల్లల్ని మంటల వద్ద లేదా మంటలు అంటుకునే ప్రదేశంలో లేదా వంటచేసే ప్రదేశంలో ఒంటరిగా వదలకండి
  • హీటర్లు, వేడిగా ఉండే ఇస్త్రీ పెట్టెలు మరియు ఇతర వేడి ఉపకరణాల నుండి పిల్లల్ని దూరంగా ఉంచండి
  • మండే కొవ్వొత్తి లేదా మంటలు ఉన్న గదిలో పిల్లల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలకండి.
Sources
  • Audiopedia ID: tel020607