నీటితో పని చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నేనెలా నిరోధించగలను
స్వచ్ఛమైన నీరు ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా, కమ్యూనిటీ వాటర్ ప్రాజెక్టుల నిర్వహణతో ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ప్రజలు కలిసి పనిచేస్తున్నారు. అయితే, కమ్యూనిటీ కుళాయిలు ఎక్కడ పెట్టాలి, బావులు ఎక్కడ తవ్వాలి, ఎలాంటి వ్యవస్థ ఉపయోగించాలి లాంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సమావేశాలు, నిర్ణయాల నుండి మహిళలు తరచుగా దూరంగా ఉంటారు.
మీ సమాజానికి స్వచ్ఛమైన నీరు సులభంగా అందుబాటులో లేకపోతే, నీటి ప్రాజెక్టు కోసం ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి ఇతరులతో కలిసి పనిచేయండి. మీ సమాజానికి ఇప్పటికే నీటి వ్యవస్థ ఉంటే, నీటి సరఫరా కోసం ఉపయోగించే వ్యవస్థను ఎలా సరిచేయాలి మరియు చూసుకోవాలి అనే దాని గురించి మహిళలకు శిక్షణ ఇవ్వాల్సిందిగా అడగండి.
నీటిలో రసాయనాలు విడుదల చేసే కర్మాగారాల దిగువ ప్రాంతంలో మీరు నివసిస్తుంటే, మెరుగైన పరిస్థితుల కోసం పనిచేయడం కోసం మీ సమాజాన్ని వ్యవస్థీకరించడానికి ప్రయత్నించండి.