నీళ్లతో పనిచేయడం నా ఆరోగ్యాన్ని ఏవిధంగా దెబ్బతీస్తుంది

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మహిళలు తరచుగా వారి కుటుంబాల కోసం అవసరమయ్యే మొత్తం నీటిని మోసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే, మహిళలు చాలా తరచుగా కడగడం మరియు శుభ్రపరచడం పనులు కూడా చేస్తుంటారు. పిల్లలకు స్నానం చేయిస్తారు. స్త్రీ ఆరోగ్యానికి మరియు ఆమె కుటుంబ ఆరోగ్యానికి ఈ పనులన్నీ ముఖ్యమైనవి అయినప్పటికీ, తరచుగా ఇవే పనులు ఆమెకు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి.

నీళ్లతో పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు:

కలుషిత నీటితో ఎక్కువ గంటలు సంబంధం కలిగి ఉండే మహిళలు ఆ నీటిలో మరియు సమీపంలోని పరాన్నజీవులు మరియు సూక్ష్మక్రిములకు గురవుతారు. ఈ మహిళలకు బిల్హర్జియా, గినియా పురుగు, రివర్ బ్లైండ్‌నెస్ మరియు కలరాతో పాటు ఇతర పరాన్నజీవి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములు సంక్రమించే అవకాశం ఉంది.

ఫ్యాక్టరీ లేదా పెద్ద పెద్ద పొలాల నుండి మురికి జలాలు వచ్చే క్రింది భాగంలో నివసించే మహిళలు ఆ నీటిలో రసాయనాలకు గురికావచ్చు. రసాయనాలు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మహిళలు మోసుకెళ్లే భారీ వస్తువుల్లో నీళ్లు కూడా ఒకటి కాబట్టి, నీళ్లు సేకరించి తీసుకెళ్లడం వల్ల వారిలో వెన్నునొప్పి, మెడ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి.

Sources
  • Audiopedia ID: tel030109